ఇన్నాళ్లు హ్యాపీగా కెరీర్ లీడ్ చేసిన రష్మిక మందనకు ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతోంది. రెగ్యులర్ క్యారెక్టర్స్ తో ఎలాగోలా బిజీ అయిన రష్మిక కాలిబర్ ని టెస్ట్ చేయబోతోంది పుష్ప. కన్నడ బ్యూటీ గ్లార్ రోల్స్ మాత్రమే చేస్తుందా.. పెర్ఫామెన్స్ కంటెంట్ కూడా ఉందా అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టబోతోంది పుష్ప. 

 

రష్మిక మందనకు ఇప్పటి వరకు బబ్లీ రోల్స్ మాత్రమే ప్లే చేసింది. రెగ్యులర్ క్యారెక్టర్స్ తోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఇలాంటి రోల్స్ తోనే మహేశ్ బాబుతో జోడీ కట్టింది. ఈ ఇమేజ్ తోనే సుకుమార్, అల్లు అర్జున్ పుష్పలోనూ అడుగుపెట్టింది. అయితే ఈ సినిమానే రష్మికకు పెద్ద పరీక్షలా మారుతుందని చెబుతున్నారు సినీ ఇండస్ట్రీ జనాలు. 

 

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది పుష్ప. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం దందా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తోంది రష్మిక. ఈ మూవీలో హీరో హీరోయిన్లు ఇద్దరు రెడ్ మేకప్ తో డీ గ్లామర్ గా కనిపించబోతున్నారు. ఆల్ రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో బన్నీ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రష్మిక క్యారెక్టర్ పై ఆసక్తి పెరుగుతోంది. 

 

పుష్ప సినిమా కోసం రష్మిక చాలా కష్టపడుతోందని.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి చిత్తూరు స్లాంగ్ కూడా నేర్చుకుంటోందని చెబుతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో వర్చువల్ వర్క్ షాప్ కు కూడా అటెండ్ అయిందని సమాచారం. మరి ఈ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ను రష్మిక ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. పెర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకుంటుందా.. రష్మిక గ్లామర్ డాల్ మాత్రమే కాదు.. మంచి నటి అని కాంప్లిమెంట్స్ కూడా అందుకుంటుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: