బాలయ్య పక్కన హీరోయిన్ ఎవరు అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. బాలయ్యతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఉన్నారు. మంచి కధలతో వచ్చే డైరెక్టర్లు ఉన్నారు. ఇక ఫ్యాన్స్ అయితే అరవయ్యేళ్ళ బాలయ్య హీరో అయినా చూసేందుకు సిధ్ధం అంటున్నారు. ఇన్ని రకాల ప్లస్ ల మధ్య కూడా అతి పెద్ద మైనస్ ఒకటి బాలయ్య సినిమాలను పట్టి పీడిస్తోంది.

IHG

అదే హీరోయిన్ల కొరత. బాలయ్య పక్కన అంటే హీరోయిన్లు నో చెప్పేస్తున్నారు. అదే వయసు ఉన్న మిగిలిన సీనియర్ హీరోలకు మాత్రం వారు సై అంటున్నారు. మరి ఈ మతలబు ఏంటో అర్ధం కాదు, బాలయ్య ఎందుకో కొంతమంది హీరోయిన్ల కంటికి ఆనడంలేదని ఫ్యాన్స్ కూడా గుస్సా అవుతున్నారు.

IHG

బాలయ్యతో సినిమా అంటే ఇదే బిగ్ టస్క్ లా డైరెక్టర్లకు పట్టుకుందిట. ఇపుడు ఆ బరువూ బాధ్యత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మీద పడిందట. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి విధితమే. ఈ మూవీకి కధ అదుర్స్ అంటున్నారు. ఇంక అరవై డెబ్బై కోట్ల దాకా పెట్టడానికి నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి రెడీగా ఉన్నారు.

IHG

సరైన స్క్రిప్ట్ డైలాగ్స్ ఉటే ఇరగదీయడానికి బాలయ్య కూడా రెడీ. కానీ ఇప్పటికీ ఈ మూవీకి హీరోయిన్ సెట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ప్రకారం చూసుకుంటే అమలాపాల్ ని బోయపాటి సంప్రదించారని అంటున్నారు. ఆమెను ఈ మూవీలో మెయిన్ లీడ్ గా తీసుకోవాలని అనుకుంటున్నారుట.

IHG

ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారు. అయితే బోయపాటి ఇద్దరినీ కొత్తవారినే తీసుకుందామంటే బాలయ్య ఒకరిని సీనియర్ హీరోయిన్ గా తీసుకోవాలని సూచించారట. దాని ప్రకారం అందరినీ అడిగేసిన తరువాత ఇపుడు అమలాపాల్ అంటున్నారుట. మరి అమలాపాల్ ఏం చెప్పిందో చూడాలి. ఆమె కనుక ఒకే అంటే బాలయ్య పక్కన బోల్డ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లే. ఇంతకీ అమలను బోల్డ్ అనడానికి ఆమె ఓ తమిళ్ మూవీలో న్యూడ్ గా చేసింది కాబట్టి అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: