మన తెలుగు లో చాలా ఫాస్ట్ గా స్టార్ హీరో గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఉదయ కిరణ్. అతని సినిమాలు అతను కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు అవి సాధించిన విజయాలు అన్నీ కూడా అతనిని  ఒక స్టార్ ని చేసాయి. ఏ హీరో కూడా హ్యాట్రిక్ హిట్స్ ఆ టైం లో కొట్టలేదు అనే చెప్పాలి. కాని అతను మాత్రం ఆ టైం లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి స్టార్ హీరోలు కూడా సవాల్ చేసాడు అనే చెప్పాలి. ఆ సినిమాలు సాధించిన విజయం తర్వాత అతనికి చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. 

 

స్టార్ దర్శక నిర్మాతలు అతని తో సినిమాలు చేయడానికి గానూ ముందుకు వచ్చారు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా లేని విధంగా అతని సినిమాల్లో ఉన్న  కథలు వాటికి అతను ఇచ్చిన ప్రాధాన్యత అన్నీ కూడా చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అతని నటన కూడా చాలా బాగా ప్రేక్షకులకు నచ్చింది అనే చెప్పాలి. ఏ స్టార్ హీరో కూడా చేయలేని విధంగా యూత్ ని ఆకట్టుకునే విధంగా అతను కథలను ఎంపిక చేసుకున్నాడు అనే చెప్పాలి. అతని కెరీర్ లో స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత అతను చేసిన తప్పులు అతనిని బాగా ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం. 

 

అతను ఇప్పుడు  చాలా మందికి గ్లామర్ బాయ్ గా గుర్తున్నాడు. అతని నటన గుర్తుంది. అతని ఆత్మహత్య చాలా మందిని బాధ పెట్టిన విషయం. అతను ఎందుకు చేసుకున్నాడు అనేది స్పష్టంగా తెలియదు గాని అతను మాత్రం కెరీర్ లో చాలా ఇబ్బందులు పడ్డాడు. వచ్చిన ఇమేజ్ ని అసలు కాపాడుకోలేదు. అతని కెరీర్ ని ఒక స్టార్ హీరో నాశనం చేసాడు అని అంటారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: