టాలీవుడ్ లో సుమంత్ గురించి అందరికి తెలిసిన విషయమే. సుమంత్ చాల ఆమంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరో సంగతి అందరికి తెలుసు. సుమంత్ సినిమాలు అనగానే చాలా మంది యూత్ లో అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ హీరో గా పైకి రావడానికి అతను ప్రయత్నాలు చేసిన సరే ఆ తర్వాత తర్వాత అతను చేసిన కొన్ని కొన్ని తప్పులు బాగా ఇబ్బంది పెట్టాయి. దీనికి కారణం అతనికి ఉన్న కొన్ని  కొన్ని విభేదాలు అని అంటారు. అది నిజమా కాదా అనేది తెలియదు గాని కథల ఎంపికలో తొందర పడ్డాడు. 

 

మహా నంది లాంటి సినిమా అతను చేసి ఉండకూడదు అని చాలా మంది అన్నారు. ఆ సినిమా ఫాన్స్ కి బాగా నచ్చింది గాని సినిమా కథలో పట్టులేకపోవడం ఫెయిల్ అయింది. ఇక  అక్కడి నుంచి అతనికి ఆఫర్లు రావడం అనేది దాదాపుగా ఆగింది అని అంటారు. ఇప్పుడు అతను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కాస్త భిన్నంగా కనపడే ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత అతను తమిళ సినిమా ఒకటి రానా తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

మరి అది నిజమా కాదా అనేది తెలియదు. ఇక అతను ఇప్పుడు చాలా వరకు ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.  వచ్చే ఏడాది అతని సినిమాలు రెండు విడుదల అయ్యే అవకాశం ఉంది అని టాక్. ఇక అతను బాలీవుడ్ లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అని అప్పట్లో ప్రచారం జరిగినా సరే అది నిజం కాదు అని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: