కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ కకావికలం అయిపోయింది. లాక్ డౌన్ నుండి మినహాయింపులు వచ్చాక ప్రభుత్వాలు షూటింగ్ చేసుకోండి అని అనుమతులు ఇస్తున్నా భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక షూటింగ్ పూర్తి అయిపోయిన సినిమాలు విడుదల చేసేందుకు థియేటర్లు మూసేసి ఉన్నాయి. ముందు ఆగస్టు లో తిరిగి ఓపెన్ అవుతాయని అనుకున్నా ఇప్పుడు దసరా సమయానికి మొదలైతే గొప్ప అని అంతా అనేస్తున్నారు. సమయంలో చిన్న మరియు మీడియం బడ్జెట్ ప్రాజెక్టులు ఓటిటి ప్లాట్ఫామ్స్ వైపు చూస్తున్నాయి.

 

సినిమా మొత్తం పూర్తయిపోయి తమకు వడ్డీలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఓటిటి ప్లాట్ఫామ్స్ నుండి మంచి డీల్స్ వస్తే వెంటనే తమ సినిమాను వారికి అమ్మేస్తున్నారు. ఇక పెద్ద సినిమా నిర్మాతలు డిసెంబర్, సంక్రాంతి రిలీజ్ పైన దృష్టి పెడుతున్నారు. కానీ మీడియం బడ్జెట్ సినిమా మాత్రం అసలు ఎంత ఇచ్చినా మేము వాటికి మొగ్గు చూపే అవకాశం లేదని అంటున్నారు.

 

IHG

 

 

మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఆరంగ్రేటం చేస్తున్న 'ఉప్పెన' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమా షూటింగ్ అంతా పూర్తి కాగా దాని బడ్జెట్ పాతిక కోట్లు గా చెబుతున్నారు. సుకుమార్ కథను సమకూర్చిన చిరానికి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది.

 

ఇకపోతే ఉప్పెన సినిమా హక్కుల కోసం రీసెంట్ గా మూడు ఓటిటి కంపెనీలు ఎంక్వయిరీ చేసాయి. ఎన్నాళ్లయినా, ఎంత వడ్డీ పెరిగినా థియేటర్లోనే సినిమా రిలీజ్ అవుతుందని మైత్రి మూవీస్ తేల్చేసిందట. చిత్రం పైన ఇప్పటికే పాతిక కోట్ల లెక్క తేలిందట. అంత మొత్తం రేంజ్ సినిమాకు ఓటిటి ద్వారా వచ్చే అవకాశమే లేదు. థియేట్రికల్ గా చిత్రం సంచలనం అవుతుందని నిర్మాతల నమ్మకం. అందుకే స్థాయిలో ఖర్చు పెట్టేసారు. కరోనా వారి ప్రణాళిక పాడు చేసినా కానీ మంచి సీజన్లో రిలీజ్ చేస్తే సినిమాకు ఢోకా ఉండదని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: