'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు రాని కష్టాలు ఈ సినిమాకి వచ్చాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రారంభించిన టైములో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఏడాది జూన్ 30వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా రాజమౌళి డేట్ ప్రకటించారు. తీరా ఇద్దరు హీరోలు రామ్ చరణ్…. జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నాక ఇద్దరికీ దెబ్బలు తగలడంతో గాయాలు పాలవడంతో సినిమా కొన్ని నెలలపాటు ఆగిపోవటం జరిగింది. ఇదే తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కన్ఫామ్ అవటానికి చాలా టైమ్ పట్టింది.

 

అయితే ఆ తర్వాత హీరోయిన్ కన్ఫామ్ అయినా కరోనా రాకతో లాక్ డౌన్ ఏర్పడటంతో సినిమా షూటింగ్ అయిపోయింది. అన్ని సినిమా షూటింగ్ లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కూడా కొద్ది నెలల పాటు ఆగిపోవడం జరిగింది. అయితే ఇటీవల ప్రభుత్వాల నుండి సినిమా షూటింగ్ లకు అనుమతులు వచ్చినా రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేయలేదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ విషయంలో రాజమౌళి ఎందుకు షూటింగ్ ప్రారంభించ లేదు అన్నది ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 

కాగా రాజమౌళి సినిమా షూటింగ్ ఆపడానికి కారణం… ‘ఆర్ఆర్ఆర్’ భారీ బడ్జెట్ సినిమా కావడంతో షూటింగ్ స్పాట్ లో కనీసం రెండు వందల మంది పనిచేసే పరిస్థితి ఉండటంతో వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు టాక్. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం షూటింగ్ స్పాట్ లో కేవలం 30 నుండి 50 మందితో షూటింగ్ చేయాలని నిబంధనలు విధించడంతో రాజమౌళి ఇప్పుడప్పుడే సినిమా షూట్ చేయకుండా ఉండటమే బెటర్ అని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆపేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: