టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది రష్మిక మంధన. ఆమె సినిమాలు ఆమె నటన అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆమె ఇప్పుడు స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. మహేష్ బాబు సహా పలువురు స్టార్ హీరోలతో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక అగ్ర హీరోలు కూడా ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమె సొంత రాష్ట్రం కర్ణాటక.
అక్కడి నుంచి ఆమె చిన్న చిన్న సినిమాలతో పైకి వచ్చి అక్కడి నుంచి వరుసగా ఆఫర్లతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి అన్నారు గాని అది మాత్రం నిజం కాదు. ఇక ఆమె తెలుగు లో మాత్రమే సినిమాలు చేస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు చాలా మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. రాబోయే రెండేళ్లకు సరిపడా ఆమె సినిమాలను లైన్ లో పెట్టుకుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె దాదాపుగా నటించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆమె... తమిళం లో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.
అది నిజమా కాదా అనేది తెలియదు గాని ఆమెకు ఆఫర్ అయితే విజయ్ సినిమాలో వచ్చింది అని టాలీవుడ్ లో టాక్ మరి. ఇక ఆమె అక్కడ చేస్తుందా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఇప్పుడు ఉన్న వాతావరణం లో ఆమె ఎక్కువగా డిమాండ్ కూడా చేయలేని పరిస్థితి లో ఉంది అని టాలీవుడ్ లో టాక్ మరి. చూద్దాం ఇక ఎం జరుగుతుంది అనేది.