టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ కు ఇప్పటికీ కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. తొలి సినిమా నుండి తనదైన మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మణిశర్మ, కెరీర్ లో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు చూసారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని మొన్నటివరకు దాదాపుగా అందరు హీరోలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ, కొన్నాళ్ల క్రితం దేవిశ్రీప్రసాద్, థమన్ ల రాకతో కొంత అవకాశాల పరంగా వెనుకబడ్డారు. అయితే ఇటీవల మళ్ళి ఆయనకు అవకాశాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. 

IHG

ఇకపోతే ముఖ్యంగా మణిశర్మ కెరీర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ సినిమాలకు మణిశర్మ అందించిన సాంగ్స్ అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి. మహేష్ బాబు ఫస్ట్ సినిమా రాజకుమారుడు లోని సాంగ్స్ అన్ని కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించాయి. గోదారి గట్టు పైన, రామసక్కనోడమ్మా, ఇంద్రుడో చంద్రుడో, ఎందుకీ ప్రాయము సాంగ్స్ అయితే మరింతగా శ్రోతలను అలరించాయి. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ సాధించడంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర వహించింది. 

 

అలానే సాంగ్స్ తో పాటు సీనియా టైటిల్స్ తో పాటు సినిమా మధ్యలో పలు సందర్భాల్లో వచ్చే గిటార్ మ్యూజిక్ అయితే మరింత హైలైట్ అని చెప్పాలి. ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన తొలి సినిమా చిరుత సినిమాలోని సాంగ్స్ కూడా అప్పట్లో మంచి రెస్పాన్స్ సాధించాయి. యమహొ యమా, లవ్ యు రా, చమ్కా చమ్కా చమ్కీరే సాంగ్స్ బాగా అదరణ పొందాయి. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ లో కూడా మ్యూజిక్ మంచి పాత్ర పోషించింది. ఈ విధంగా మహేష్, చరణ్ ల ఫస్ట్ సినిమాలకు మణిశర్మ అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చారు....!!    

మరింత సమాచారం తెలుసుకోండి: