పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. పిల్లలు అఖిరా నందన్, ఆద్య గురించి అనేక విషయాలు నెటిజన్ల తో పంచుకుంటుంది. ఇటీవల ‘బద్రి’ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు అవటంతో ఆ సినిమాలో తాను హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడంతో సోషల్ మీడియాలో అనేక విషయాలు సినిమా గురించి చెప్పుకొచ్చింది.

IHG

ఆ సందర్భంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా లైవ్ లో  పాల్గొనటంతో మరోసారి తనకు సినిమాల్లో నటించాలని, అది హీరో తల్లిగా నటించాలని అవకాశం కల్పించాలని పూరీని  కోరడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్ చేసింది. గతంలో రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద చర్చకు దారి తీసింది.

IHG

పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. పెద్ద కాంట్రవర్సి గా ఈ విషయం మారటంతో రేణు దేశాయ్ మరోసారి రెండో పెళ్లి గురించి పెద్దగా మాట్లాడలేదు. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న అడిగితే.. ఎక్కడికి వెళ్లినా నా పెళ్లే మెయిన్ టాపిక్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే, చేసుకోకపోయినా ఇబ్బందే. ఈ సందేహాలు అన్నీ తీరేలా ఒక సినిమా తీసి, దానికి పెళ్లి గోల అని టైటిల్ పెడతాను అని సరదాగా వ్యాఖ్యానించారు రేణు దేశాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: