టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా రామ్ గోపాల్ వర్మ తీసిన రాత్రి సినిమాతో తొలిసారిగా సంగీత దర్శకుడిగా పరిచయమైన మణిశర్మ, మెల్లగా ఆ తరువాత నుండి ఒక్కో సినిమా అవకాశంతో మంచి మ్యూజికల్ హిట్స్ అందిస్తూ ముందుకు సాగారు. ఇకపోతే తన కెరీర్ లో పెద్ద స్టార్స్ తో పాటు ఎందరో చిన్న స్టార్స్ కు కూడా అద్భుతమైన సాంగ్స్ అందించిన మణిశర్మ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఎన్నో మ్యూజికల్ సక్సెస్ లు అందించడం జరిగింది. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=OFFICE' target='_blank' title='office-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>office</a> burgled

ఎన్టీఆర్ హీరోగా నటించిన మూడవ సినిమా సుబ్బుకు తొలిసారిగా మణిశర్మ సంగీతం అందించారు. రుద్రరాజు సురేష్ వర్మ దర్శకతంలో 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు అందులో సాంగ్స్ కూడా శ్రోతలను అలరించాయి. ఆ తరువాత ఎన్టీఆర్, వివి వినాయక్ ల కాంబోలో వచ్చిన ఆది సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన అందించిన మణిశర్మ, ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎన్టీఆర్, మణిశర్మ కాంబోలో సాంబ, నరసింహుడు, అశోక్, కంత్రి, శక్తి చిత్రాలు రావడం జరిగింది. 

IHG't keep calm ...

అయితే వీటిలో చాలావరకు సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఆ సినిమాల్లోని సాంగ్స్ మాత్రం మంచి సక్సెస్ సాధించి శ్రోతలను అలరించాయి. ఆ తరువాత ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని మణిశర్మ అందించారు. మొదటి నుండి వీరిద్దరి కాంబోపై ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు ఉండేవి. అయితే వారి అంచనాలు అందుకునేలా సినిమా విజయాలతో సంబంధం లేకుండా మణిశర్మ మాత్రం ఎన్టీఆర్ కు సూపర్ హిట్  సాంగ్స్ ని అందించడం జరిగింది.....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: