ఒక సినిమాకు సంగీతం అందించడం అంటే మామూలు విషయం కాదు. హీరోకి తగిన విధంగా హీరోయిన్ కి తగిన విధంగా సీన్ కి తగిన విధంగా ఇలా ఎన్నో ఉంటాయి. దర్శకుడు ఒక సందర్భంలో ఓకే అనవచ్చు మరో సందర్భంలో నో అని చెప్పవచు. ఇలాంటివి ఎన్నో సంగీత దర్శకులకు ఎదురయ్యే అనుభవాలు. అయితే కొందరు సంగీత దర్శకులు మాత్రం వాటి నుంచి చాలా ఫాస్ట్ గా బయటకు వస్తు ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పే సంగీత దర్శకుడు మణిశర్మ. ఆయన సంగీతం విన్న చాలా మందికి రీ టేక్ అనే ఆలోచన రాదు అని అంటారు. 

 

అవును ఏ సీన్ కి ఇచ్చినా ఏ పాటకు ఇచ్చినా ఏ పాత్రకు ఇచ్చినా సరే ఆయనకు మళ్ళీ రీ టెక్ అని ఎవరూ చెప్పే ఆలోచన ఉండదు అని ఆ సన్నివేశం కి అన్ని విధాలుగా ఆయన న్యాయం చేస్తూ ఉంటారు అని అంటారు. ఇక ఆయన ఒకసారి మ్యూజిక్ అందిస్తే ఇక ఆ సినిమా సూపర్ హిట్ అని అంటారు. సినిమా హిట్ అయినా లేకపోయినా సరే సినిమాలో దాదాపుగా పాటలు అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతు ఉంటాయి. స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఆయన సంగీతం కి నో చెప్పే పరిస్థితి దాదాపుగా ఉండదు అని అంటారు చాలా మంది. 

 

అగ్ర దర్శకులు అయినా చిన్న దర్శకులు అయినా సరే ఆయన సంగీతం కు ఫిదా కావాల్సిందే అని చెప్తారు. ఏ సినిమాకు అందించినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే అని అంటారు. మహేష్ బాబు సహా కొందరు హీరోలు ఆయాన్ సంగీతం కోసం ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటూ ఉంటారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: