మన తెలుగులో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే సినిమాల విషయంలో ఎవరు అయినా సరే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. ఇక పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం ఒక రేంజ్ లో భయం అనేది ఉంది. కాని రామ్ చరణ్ విషయంలో మాత్రం ఆవిధంగా లేదు అని అంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు భారీగా సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. అతను మూడు తమిళ సినిమాల హక్కులను కొని దాదాపు రెండేళ్ళ పాటు  ఒక్కో సినిమాకు కేటాయించి ఆరేళ్ళ  పాటు సినిమాలను లైన్ లో పెట్టాడు అనే టాక్ వినపడుతుంది.

 

మరి ఏ సినిమాలు అనేది పక్కన పెడితే అనీల్ రావిపూడికి ఒక ప్రాజెక్ట్ ని ఇచ్చాడు అని ఒక తమిళ కథను తెలుగులో మార్చాలి అని కోరాడు అని అనీల్ కూడా కథ మార్చడానికి రెడీ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు  ఉన్న పరిస్థితి లో పెట్టుబడి పెట్టే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కాని తమిళ సినిమాలకు సంబంధించి భారీగా హక్కులను రామ్ చరణ్ కొని లైన్ లో పెట్టాడు అని అంటున్నారు. వచ్చే సినిమాలు అన్నీ కూడా అదే విధంగా చేస్తున్నాడు అని అంటున్నారు. 

 

రీమేక్ సినిమాల మీద తను ఎక్కువగా ఫోకస్ చేసాడు అని అంటున్నారు.  దాదాపు 40 కోట్లు ఖర్చు చేసి హక్కులను కొన్నాడు అని అంటున్నారు మరి. వచ్చే రెండేళ్ళ పాటు ఆయన సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక అజిత్ చేసిన ఒక సినిమాను కూడా ఆయన కొనుగోలు చేసే అవకాశం ఉంది అని టాక్ మరి. ఏ సినిమా కొన్నాడు అనేది చూడాలి ఇక. కన్నడ ప్రాజెక్ట్ ఒకటి కొన్నాడు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: