టాలీవుడ్ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ చిన్న తనయుడు, నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు, చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి ఆ వయసులోనే ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇక ఆ తరువాత కొన్నేళ్ల గ్యాప్ తీసుకున్న అనంతరం కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, ఫస్ట్ సినిమా తోనే సూపర్ హిట్ కొట్టారు. ఆ తరువాత మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, ఇలా చెప్పుకుంటూ పోతే పలు సక్సెస్ఫుల్ సినిమాలతో తన క్రేజ్ ని మార్కెట్ ని అమాంతం పెంచుకుంటూ ముందుకు సాగుతున్న మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే మొదటి సినిమా నుండి మహేష్ ను అందరూ ప్రిన్స్ అని పిలిచేవారు. 

IHG

అయితే సరిగ్గా 2006 లో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ పోకిరి మూవీ మహేష్ మూవీ కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి, అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టింది. కాగా ఆ సినిమాతో మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ రావడంతో పాటు ఆయన మార్కెట్ వాల్యూ, ఫ్యాన్ బేస్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక దాని అనంతరం భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ నటించిన సైనికుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకముందు పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టి ఉండడంతో సైనికుడు సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. 

 

అలానే ఆ సినిమాలు ఓపెనింగ్స్ కూడా ఊహించని రేంజ్ లో భారీగా వచ్చాయి. అయితే రిలీజ్ తరువాత ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఎంతో భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిన ఆ సినిమా కథ, కథనాల్లో కొంత లోపాల వలన అప్పటి ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. నిజానికి పోకిరి ఊపులో మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన సైనికుడు కనుక అప్పట్లో మంచి హిట్ కొట్టినట్లైతే మహేష్ ఇమేజ్ అప్పుడే మరింత ఉన్నత స్థాయికి చేరి ఉండేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఆ తరువాత వచ్చిన అతిధి యావరేజ్ విజయం అందుకోగా, ఆపై మూడేళ్ళ గ్యాప్ అనంతరం మహేష్ నటించిన ఖలేజా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: