టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా చెప్పే సినిమా మహానటి. ఈ సినిమా నిజంగానే ఒక సంచలనం అనే చెప్పాలి. కేవలం మన తెలుగు లో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన తీరు ఈ సినిమాలో అతను చూపించిన కొన్ని కొన్ని సీన్స్ నిజంగా చాలా మందిని కన్నీరు పెట్టించాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో అప్పుడు ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకోలేదు అని చాలా మంది విమర్శలు చేసారు. 

 

అవి ఏంటీ అంటే ఈ సినిమాల్లో జెమిని గణేషన్ ఫ్యామిలీ విషయంలో దర్శక నిర్మాతలు కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా వివాదాస్పద అయ్యేది కాదు అని కామెంట్ చేసారు. ఈ సినిమాలో చాలా వరకు కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు ఒక విధంగానే చూపించారు అని తమ తండ్రిని అవమానించారు అని ఆయన వారసులు కొందరు మీడియా ముందుకు వచ్చి నానా విమర్శలు చేసారు అప్పుడు. కాని దర్శకుడు మాత్రం నేను వాస్తవం చూపించా అని తాను ఏమీ తప్పు చేయలేదు అని స్పష్టంగా చెప్పారు అప్పుడు. 

 

ఇక ఈ సినిమాలో కీర్తి నటన గురించి అందరికి తెలిసిన విషయమే. ఆమె నటన చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో ఆమె చేస్తుంది అని ఎవరూ కూడా అప్పుడు అసలు కనీసం ఊహించలేదు అనేది వాస్తవం. ఆమె ఈ సినిమాలో దాదాపుగా నటించింది అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆమె ప్రాణం పెట్టి నటించింది అని చాలా మంది సినిమా చూసిన తర్వాత కామెంట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: