బాలీవుడ్ లో ఫ్రాంఛైజీస్ కు క్రేజ్ ఎక్కువ. ముఖ్యంగా క్రిష్ సీక్వెల్స్ ఘన విజయం సాధించడంతో ఈ సిరీస్ నుంచి నాలుగో సినిమా ఎప్పుడెప్పుడా అని బాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఈ ఏడాది స్టార్ట్ చేసి క్రిస్మస్ కు రిలీజ్ చేద్దామనుకున్న క్రిష్ 2.. 2021 జనవరి 2021లో మొదలు కానుంది. ఈ క్రేజీ సీక్వెల్ కథ ఏంటో బయటకు వచ్చేసింది. 

 

క్రిష్ ఫ్రాంచైజీస్ లో నాలుగో సినిమాకు కథ రెడీ అయింది. కోయి మిల్ గయాలోని హృతిక్ రోషన్ స్నేహితుడు జాదూ మరింత అప్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. జాదూ సాయంతో క్రిష్ తండ్రి, శాస్త్రవేత్త రోహిత్ మిశ్రాను కాపాడుకునే కథతో క్రిష్ 4 తెరకెక్కనుందట. 

 

హృతిక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రతీసారి.. క్రిష్ సిరీస్ తో హిట్ ఇచ్చాడు తండ్రి రాజేష్ రోషన్. కొడుక్కి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి క్రిష్ నాలుగో భాగానికి కథ రెడీ చేశాడు. సూపర్ హీరోలంటే హాలీవుడ్ వాళ్లను తప్ప మరొకరిని ఊహించుకోలేని రోజుల్లో హృతిక్ రూపంలో మనకో ఓ సూపర్ హీరో దొరికాడు. 2003లో కోయి మిల్ గయాతో క్రిష్ సిరీస్ ప్రయాణం మొదలైంది. ముందు మూడు భాగాలకు కథ రెడీ చేసిన రాకేష్ రోషనే నాలుగో సీక్వెల్ కు కూడా కథ అందించాడు. 

 

క్రిష్ 4 హీరోయిన్ గా ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో దర్శకుడు రాకేష్ రోషన్ మధ్య ముందు చూపుతో హీరోయిన్ ను ఇంకా సెలక్ట్ చేయలేదన్నాడు. కోయి మిల్ గయాలో ప్రీతి జింటాతో జత కట్టిన హృతిక్ క్రిష్.. క్రిష్ 3లో ప్రియాంక చోప్రాతో ఆడిపాడాడు. 

 

క్రిష్ 3లో కంగన నెగిటివ్ రోల్ పోషించగా.. ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మరి క్రిష్ 4లో ఏ హీరోయిన్ హృతిక్ తో జత కడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: