సిద్ధార్థ, శృతి హాసన్ ల కలయికలో నిజమైన స్నేహానికి అర్ధంగా ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన సినిమా ఓ మై ఫ్రెండ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా 2011లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ స్నేహం యొక్క అసలు అర్థం, పరమార్థం తెలిపే మంచి పాయింట్ తో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ, శృతిహాసన్ లు స్నేహితులుగా కనిపిస్తారు. చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా పెరిగిన చందు, సిరి ఇద్దరూ పెరిగి పెద్దయ్యాక కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. 

IHG

అయితే వారిద్దరి మధ్యన ఉంది స్నేహం కాదు ప్రేమ అని, మిగతా వారితో పాటు వారి వారి తల్లితండ్రులు కూడా భావిస్తారు. అయితే తమ మధ్య మంచి స్నేహం తప్ప మరేమి లేదని చందు, రీతూని అలానే సిరి, ఉదయ్ ని ప్రేమించి వివాహం చేసుకుంటారు. అయితే కాలం గడిచే కొద్దీ మిగతా వివాహ బంధాల మాదిరిగా వారిద్దరి కుటుంబాల్లో సిరి, చందు స్నేహం విషయమై అపార్ధాలు చెలరేగి, చివరకు వారిద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయే పరిస్థితి రావడం, ఆపై కొన్ని పరిణామాల అనంతరం వారిద్దరి నిజమైన స్నేహంలో ఎటువంటి కల్మషం లేదని చందు, సిరి తమ భాగస్వాముల ముందు రుజువుచేయడంతో చివరికి ఇద్దరూ కూడా తమ లైఫ్ పార్టనర్స్ తో కలుస్తారు. 

 

మొదటి నుండి మంచి యూత్ఫుల్ గా ఆకట్టుకునే కథ, కథనాలతో స్నేహానికి నిజమైన అర్ధం చెపుతూ తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దార్థ, శృతిహాసన్ ల నటన మెయిన్ హైలైట్. దర్శకుడు వేణుశ్రీరాం ఎంచుకున్న స్నేహం అనే పాయింట్ లోని నిజాయితీ, నిస్వార్ధం అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాగా సినిమాలో హన్సిక, నవదీప్ ల నటనతో పాటు రాహుల్ రాజ్ అందించిన సాంగ్స్ కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: