అగ్ర హీరోల సినిమాల్లో చాలా వరకు కూడా కొన్ని కొన్ని కోణాలు  ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. సినిమా ఏ విధంగా ఉన్నా సరే అందులో ఉండే కొన్ని కొన్ని కోణాలు మాత్రం ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి.  టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎవరి సినిమాలో చూసినా సరే ఏదోక రూపంలో స్నేహం ఆనేది చూపిస్తూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమా విషయానికి వస్తే అందులో స్నేహం చాలా బాగా చూపించారు. రాహుల్ రామకృష్ణ పాత్ర స్నేహం కోసం ఏదైనా చేసే విధంగా ఉంటుంది అనే చెప్పాలి. ఆ పాత్రలో అతను చాలా బాగా నటించి మెప్పించాడు. 

 

అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది విమర్శకులను సైతం. తన ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే అతన్ని వదలకుండా అతని కోసం అతను చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. ఎన్ని మాటలు అన్నా సరే ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా సరే అతన్ని మాత్రం వదిలే ప్రయత్నం అనేది అసలు ఉండదు. ఆ సినిమాలో ఆ సీన్స్ చాలా బాగా నచ్చాయి జనాలకు. అలాంటి స్నేహితుడు ఉంటే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు కూడా. ఇక ఆ సినిమా తర్వాత రాహుల్ కి మంచి ఆఫర్లు వచ్చాయి. మహేష్ బాబు సినిమాలో కూడా అతను నటించాడు. 

 

ఆ సినిమాలో ఆ పాత్రకు గానూ అతనికి అవార్డ్ కూడా వచ్చింది. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని చాలా మంది కామెంట్స్ చేసారు సినిమా చూసి. ఈ సినిమా తర్వాత అతను చాలా  వరకు స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలో అయినా సరే కనిపించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: