సుడిగాలి సుధీర్ కి ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు సుడిగాలి సుదీర్. ముఖ్యంగా రష్మీ తో లవ్ అనే కాన్సెప్ట్ సుడిగాలి సుధీర్ ని మరింత ఫేమస్ చేసింది అని చెప్పాలి, ప్రస్తుతం ఇద్దరు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫేవరెట్ జోడిగా ఉన్నారు. మొన్నటి వరకు కేవలం జబర్దస్త్ లో మాత్రమే ఈ జోడీ కనిపించేది... కానీ ప్రస్తుతం డాన్స్ రియాల్టీ షో ఢీ  లో ఇద్దరు టీమ్ లీడర్గా చేస్తుండడంతో వీరిద్దరి మధ్య సంభాషణలు... అనుబంధం తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రష్మీ కోసం సుడిగాలి సుదీర్ చెప్పే డైలాగులు మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాయి  అని చెప్పాలి, 

 

 వీరిద్దరి జోడిని చూస్తున్న ప్రేక్షకులందరికీ వీళ్ళు  మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారూ. అయితే రష్మీ సుధీర్ పెళ్లి చేసుకుంటే బాగుండును అని కోరుకోని  తెలుగు ప్రేక్షకుడు లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ ఉన్న ప్రశ్న. అయితే గతంలో  ఈటీవీలో ప్రసారమైన ఓ ఈవెంట్ లో సుధీర్ రష్మీ... జబర్దస్త్ టీం  సమక్షంలో పెళ్లి చేసుకోవడం తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిసిపోయారు అని చెప్పాలి. ఇలా రీల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నట్లు గానే రియల్ లైఫ్లో కూడా భార్య భర్తలు అయితే ఎంత బాగుండు అని కోరుకున్నారు. 

 


 అయితే తాజాగా సుధీర్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే సుడిగాలి సుదీర్ రష్మి గౌతమ్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ లో పెళ్లి గురించి ఏం ఆలోచించావు సుధీర్ అంటూ ఆలీ ప్రశ్నించగా...లాక్ డౌన్  లో ఇంట్లో ఉండడంతో తన పేరెంట్స్ నుంచి పెళ్లిగోల ఎక్కువైందని... మా అక్క కూడా మేము ఇండియా రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటూ కండిషన్ పెట్టింది  అంటూ సుడిగాలి సుదీర్ చెప్పుకొచ్చాడు. ఇక చివరికి లాక్ డౌన్ లో మా ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అంటూ సుధీర్ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో అలీ కూడా షాక్ అయ్యాడు. అసలేం జరిగింది తెలియాలంటే మాత్రం పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: