మళయాళ ప్రేమం సినిమాలో మలార్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన భామ సాయి పల్లవి. తమిళ అమ్మాయే అయినా ఇప్పటికి తనని మల్లు బ్యూటీ అనేలా చేసుకుంది. ఈమధ్య అమ్మడు తనని మల్లూ బ్యూటీ అనడంపై కస్సు బుస్సుమన్నది కూడా. కేవలం అభినయంతోనే మెప్పించే భామల లిస్ట్ లో మొదటిస్థానంలో ఉంటుంది సాయి పల్లవి. ప్రస్తుతం రానాతో విరాటపర్వం.. నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది అమ్మడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న లవ్ స్టోరీ సినిమా చేస్తుంది. ఫిదాలో భానుమతి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి స్వతహాగా డ్యాన్సర్ అయిన విషయం తెలిసిందే.

 

ఢీ డ్యాన్స్ షో సీరీస్ మొదట్లో పాల్గొన్న అమ్మడు తర్వాత సినిమా హీరోయిన్ గా మెరిసింది. అయితే తను చేసే సినిమాల్లో డ్యాన్స్ లో కూడా అదరగొడుతుంది అమ్మడు. సాయి పల్లవి నటించిన సినిమాల్లో ఏదో ఒక సాంగ్ యూట్యూబ్ లో సూపర్ హిట్ అవుతుంది. ఫిదాలో వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే సాంగ్ తో పాటుగా మారి 2లో కూడా రౌడీ బేబి సాంగ్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అందుకే సాయి పల్లవి సినిమా అంటే ఆమె పాటలు కూడా యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తాయి. 

 

ఇక లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో ఆమె ఓ సాంగ్ కు కంపోజ్ చేస్తుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సాంగ్ కూడా సినిమాలో స్పెషల్ గా ఉండటమే కాకుండా కచ్చితంగా యూట్యూబ్ లో కూడా సూపర్ హిట్ అవడం గ్యారెంటీ. సాయి పల్లవి చేస్తున్న ప్రతి సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అవుతుంటాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబో స్పెషల్ గా రాబోతుంది. లవ్ స్టోరీ టీజర్ సాంగ్ కూడా ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అవగా సినిమా కూడా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: