నటసింహం నందమూరి బాలకృష్ణ కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన కథానాయకుడు, మహానాయకుడు రెండూ కూడా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక మొన్న డిసెంబర్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా కూడా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి సక్సెస్ కాలేకపోయింది. ఈ విధంగా వరుసగా సినిమాలు పరాజయాల పాలవడంతో, కొంత ఆలోచనల చేసిన బాలకృష్ణ, గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటికి తన నెక్స్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. 

IHG

ప్రస్తుతం తెరెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పవర్ఫుల్ రోల్స్ లో కనిపించనున్నట్లు టాక్. లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజున యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, కామెడీ, డ్రామా తదితర అంశాల కలబోతగా సాగుతుందట. ముఖ్యంగా బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అయితే మరింతగా అదిరిపోతాయని టాక్. ఇకపోతే సినిమాలో కీలకమైన ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, యావత్ సినిమా మొత్తానికి పెద్ద హైలైట్ అని అంటున్నారు. 

 

ఎంతో గ్రాండ్ లెవెల్లో రోమాలు నిక్కబొడుచుకునేలా బోయపాటిఎపిసోడ్ ని ప్లాన్ చేసారని, కాగా అతి త్వరలో తెరకెక్కనున్న ఆ ఎపిసోడ్ కి గాను ఖర్చు కూడా భారీగానే పెట్టనున్నారని సమాచారం. గతంలో బాలకృష్ణతో తాను తీసిన సింహా, లెజెండ్ సినిమాల్లోని ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు బోయపాటి. కాగా వీరిద్దరి కాంబోలో మూడవసారి వస్తున్న ఈ సినిమాలోని ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: