“నా పేరు సూర్య” దారుణంగా ఫ్లాప్ అయిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత కెరియర్లో రెండు అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన "అలా వైకుంఠపురం లో" సినిమా స్టోరీ ఓకే చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అతి తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేసిన బన్నీ, ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టించాడు. తన కెరీర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర "నాన్ బాహుబలి" రికార్డులు మొత్తం పగలగొట్టాడు.

 

అంతేకాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ కూడా సాధించాడు. అయితే ఈ సినిమా అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ఓకే చేయటం అందరికీ తెలిసిందే. లారీ డ్రైవర్ పాత్రలో ఊర మాస్ క్యారెక్టర్ అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా గుబురు గడ్డంతో, గుబురు జుట్టుతో బన్నీ తన పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే 'నా పేరు సూర్య తో' లాంగ్ గ్యాప్ రావడంతో 'పుష్ప' సినిమా అయిన వెంటనే 'ఐకాన్' సినిమా చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడట.

 

అంతేకాకుండా ఐకాన్ తో పాటు మరో డైరెక్టర్ సినిమా కూడా స్టార్ట్ చేయాలని బన్నీ అనుకుంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మరి అల్లు అర్జున్ అనుకున్న ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బన్నీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో అన్నది సస్పెన్స్ గా మారింది. ఏ మాత్రం కరోనా వైరస్ విరుగుడు అయ్యింది అంటే బన్నీ మాత్రం భారీ స్పీడులో సినిమాలు చేయాలి అనుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: