ఓటీటీ లో సినిమా అనగానే చాలా మంది ఇప్పుడు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. హీరో ఓకే చెప్తే చాళ్ళు ఆ సినిమా దాదాపుగా ఓటీటీ లో రావడానికి రెడీ అవుతుంది అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న ప్రచారం ప్రకారం చూస్తే టాలీవుడ్ లో చిన్న హీరోల సినిమాల్లు అన్నీ కూడా అందులోనే వచ్చే అవకాశం ఉందిఅనే విషయం చాలా వరకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో కాస్త హాట్ టాపిక్ గా మారింది. అది ఏంటీ అంటే ఓటీటీ సినిమాల్లో మహేష్ బాబు కూడా అడుగు పెట్టే అవకాశం ఉంది అన్ని అంటున్నారు. 

 

ఒక ఓటీటీ ఫ్లాట్ ఫాం ని సితారా అనే పేరుతో తీసుకొచ్చే ఆలోచన మహేష్ బాబు చేస్తున్నాడు అని దీనికి నమ్రత ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది అని వచ్చే ఏడాది మొదట్లో ఇది వచ్చే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు ఇప్పటి వరకు  మహేష్ బాబు సహా కృష్ణ నటించిన సినిమాలు అన్నీ కూడా ఇందులో పెట్టే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీనికి సంబంధించి మహేష్ బాబు అయితే ఒక ప్లాన్ కూడా రెడీ చేసాడు అని టాలీవుడ్ లో టాక్. 

 

మహేష్ బాబు  ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు కూడా కాస్త ఎక్కువగానే పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రపైనే చర్చలు అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా ఎవరు నటించే అవకాశం ఉంది అనేది మాత్రం తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: