టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసి అవి హిట్ అయితే చాలు నటన పరంగా స్టార్ అనే పేరు దాదాపుగా వస్తుంది ఆనే చెప్పాలి. చిన్న చిన్న పాత్రల్లో హిట్ అయిన వారిని కూడా స్టార్ అని అంటున్నారు టాలీవుడ్ జనాలు అనే విషయం చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక సినిమాకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల ఒక సినిమాలో నటించి స్టార్ గా పేరు తెచ్చుకున్న ఒక మహిళా నటి ఆమె టాలీవుడ్ లో ఇప్పుడు ఒక పెద్ద ఆఫర్ కోసం  ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. అవును ఆమె పెద్ద ఆఫర్ కోసం ఇప్పుడు చాలా వరకు కష్టపడుతుంది అనే టాక్ మరి. 

 

ఆ పాత్ర ఏంటీ అనేది తెలియదు గాని ఆమె తనకు ఉన్న పరిచయాల ద్వారా కొందరిని పదే పదే అడుగుతుంది అని అది కూడా స్టార్ హీరో సినిమాలో అని అంటున్నారు. మరి ఆమెను ఏమంటారు అనేది తెలియదు గాని ఆమె అయితే ఇప్పుడు ఈ పాత్ర కోసం ప్రతీ రోజు కూడా కొందరిని అడగడం వారి చుట్టూ తిరగడం వంటివి చేస్తుంది అని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా వస్తుంది అని ఆ స్టార్ హీరో మాత్రం  ఆ పాత్ర కోసం తన భార్యను తీసుకోవాలి అని చూస్తున్నారు అని కాని ఆమె మాత్రం తనకు కావాలి అని నిర్మాత ద్వారా పట్టుబడుతుంది అని అంటున్నారు. 

 

ఆమెకు యాంకర్ గా కూడా మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆమె ఆ పాత్ర కోసం గానూ చాలా తీవ్రంగా కష్టపడుతూ నానా రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఆమెను తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: