టాలీవుడ్ సినిమా పరిశ్రమకి ముందుగా కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన అనగనగా ఒకదీరుడు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది, లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల తనయ శృతిహాసన్. అయితే తొలి సినిమా తోనే ఆమెకు భారీ పరాజయం ఎదురయింది. అనంతరం మరొకసారి సిద్ధార్థ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమా లో హీరోయిన్ గా నటించిన శృతి, ఆ సినిమా ద్వారా కూడా మరొక పరాజయాన్ని చవి చూశారు ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా లో ఆమెకు హీరోయిన్ గా అవకాశం రావటం, అనూహ్యంగా ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో శృతిహాసన్ కు ఆపై మంచి అవకాశాలు దక్కాయి. 

IHG

అయితే ఆ తర్వాత తాను జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్న రామయ్య వస్తావయ్యా సినిమాకు గాను శృతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు హరీష్ శంకర్. కానీ ఆ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, గబ్బర్ సింగ్ సమయంలోనే శృతిహాసన్ కు ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో నటించే అవకాశం రావడం, అలానే ఆ సినిమా ఓపెనింగ్ లో ఆమె పాల్గొనడం జరిగాయి. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ, ఆ సినిమా నుండి తాను తప్పుకుంటున్నట్లు శృతి ప్రకటించింది. 

 

కాగా ఆ సినిమాలో శృతి స్థానంలో త్రిషని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక రిలీజ్ అనంతరం ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయింది. ఒకవేళ మొదట ఎన్టీఆర్ సరసన దమ్ము లో నటించి ఉంటె శృతిని ఫ్లాప్ వెంటాడి ఉండేది, అయితే అది తప్పించుకున్న శృతి, ఆపై తెరకెక్కిన రామయ్య వస్తావయ్యా ద్వారా ఎన్టీఆర్ తో తొలిసారిగా జతకట్టడం, ఈ సినిమా కూడా పరాజయం పాలవడం జరిగింది. ఈ విధంగా ఒకసారి ఎన్టీఆర్ తో సినిమా ద్వారా ఫ్లాప్ నుండి తప్పించుకున్నా, తదుపరి మాత్రం శృతి హాసన్ దాని నుండి తప్పించుకోలేకపోయింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: