మళయాళ భామ నిత్యా మీనన్ అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా నుండి అభినయానికి పాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వచ్చంది. నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ వస్తున్న అమ్మడు లేటెస్ట్ గా ఓ వెబ్ సీరీస్ కోసం రెచ్చిపోయింది. ఇప్పటివరకు క్లీన్ యు సర్టిఫికెట్ సినిమాలను మాత్రమే చేసిన నిత్యా మీనన్ డిజిటల్ ఫ్లాట్ ఫాం లోకి రావడం రావడమే హాట్ హాట్ గా కనిపించేస్తుంది. అంతేకాదు లెస్బియన్ రొమాన్స్ చేసింది. తన సహ నటితో లిప్ లాక్ చేసింది నిత్యా మీనన్. ఇన్నాళ్లు సినిమాల్లో పద్ధతిగా నటించిన నిత్యా మీనన్ ను ఇలా చూసి అందరు షాక్ అవుతున్నారు.

 

హిందిలో తెరకెక్కిన ఈ బ్రీత్ వెబ్ సీరీస్ లో నిత్యా మీనన్ లెస్బియన్ గా నటించింది. అందులో భాగంగా ఆమె చేసిన రొమాన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అమ్మడికి బాలీవుడ్ నీళ్లు బాగా పడినట్టు ఉన్నాయి అందుకే ఇలా రెచ్చిపోయిందని మీడియా సర్కిల్స్ వార్తలు రాస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ తన సెకండ్ యాంగిల్ చూపించడం మొదలుపెట్టిందని అంటున్నారు. ఒకవేళ నిత్యా మీనన్ తెలుగులో కూడా అలా హాట్ గా కనిపించడం మొదలుపెడితే ఇక్కడ కూడా వరుస ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.

 

అమ్మడిని కేవలం అభినయ తారగా మాత్రమే చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె గ్లామర్ సైడ్ కూడా అందిస్తే థ్రిల్ అవుతారు. ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డ నిత్యా మీనన్ కొద్దిగా బొద్దుగా కూడా మారింది. అయితే తనని బాడీ షేమింగ్ చేసే వారి మీద అంతే ఘాటుగా రిపలి ఇస్తూ ఈమధ్యనే అమ్మడు ఓ మెసేజ్ పెట్టింది. మొత్తానికి నిత్యా మీనన్ తన ఉణికి చాటుకునేందుకు బాగానే ప్రయత్నిస్తుందని మాత్రం చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: