టైటిల్ చూసి ఏంటి మెగాస్టార్ చిరంజీవి డైరక్షన్ చేస్తున్నాడా.. అది మేనళ్లుడు సాయి తేజ్ ను హీరోగా పెట్టా అని అనుకోవచ్చు. కాని ఇక్కడ మ్యాటర్ అది కాదు మెగాస్టార్ చిరంజీవి కెరియర్ డైరక్షన్ లో సాయి తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సాయి తేజ్ ప్రస్తుతం ప్రషానం ఫేం దేవా కట్ట డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ సాయి తేజ్ హీరోగా వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సుబ్బు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ ను అలరిస్తుందని తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమా తర్వాత సాయి తేజ్ గోపాల్ అనే నూతన దర్శకుడికి ఓకే చెప్పాడట. చిరు సలహా మేరకే సాయి తేజ్ ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. చిరంజీవి దగ్గరకు వచ్చిన ఈ కథను సాయి కోసమైతే బాగుంటుందని అనుక్కుని అతనికి రిఫర్ చేశాడట. ఇక చిరు ఆమోద్ర ముద్ర వేశాక మేనళ్లుడు కాదంటాడా చెప్పండి. గోపాల్ డైరక్షన్ లో సాయి తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

వరుసగా ఆరు ఫ్లాపులు అందుకున్న సాయి తేజ్ చిత్రలహరితో హిట్ అందుకోగా.. ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి తేజ్ ఆ హిట్ ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు. మరి మెగాస్టార్ ఏరి కోరి రిఫర్ చేసిన సినిమా అంటే కచ్చితంగా సాయి తేజ్ కెరియర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ కు రెడీ అవగా థియేటర్లు బంద్ వల్ల సినిమా రిలీజ్ ఎప్పుడన్నది నిర్ణయించలేదు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: