కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో అమ్మడికి ఓ రేంజ్ పాపులారిటీ ఉంది. తెలుగులో కూడా సీనియర్ స్టార్స్ కు ఆమెనే ఫస్ట్ ఆప్షన్. తమిళంలో ఆమె చేసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. అంతేకదు అక్కడ స్టార్స్ సైతం ఆమె సినిమాలకు పోటీగా రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా.. అలవోకగా చేసే నయనతార.. సినిమాలైతే చేస్తుంది కాని సినిమా ప్రమోషన్స్ కు మాత్రం నో అంటుంది. నయనతార మీద ఉన్న ఏకైక కంప్లైంట్ ఆమె ప్రమోషన్స్ కు రాకపోవడమే.

 

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఆమె ది బెస్ట్ అనిపించుకుంది. అయితే తను పత్రికలతో ఇంటర్వ్యూస్, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోడానికి ఓ కారణం ఉంది అంటుంది నయనతార. కెరియర్ మొదట్లో తను ఇచ్చిన ఇంటర్వ్యూని ఆ పత్రిక వారు తప్పుగా ప్రెజెంట్ చేశారు. అందుకే అప్పటినుండి పత్రికల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా మానేశానని అన్నది నయనతార.  సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం నాకు ఇష్టం ఉండదని.. ఇక ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వనని.. తాను ఏమి ఆలోచిస్తున్నానో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదని అన్నది నయనతార. 

 

ఇక సినిమా ప్రమోషన్స్ గురించి చెబుతూ సినిమాలో మనం ఏం చేశామన్నది మనం చెప్పడం కన్నా పాత్ర చెబితే బాగుంటుంది అన్.. తానేమి మాట్లాడనని.. ఆ పాత్రే మాట్లాడుతుందని అంటుంది నయనతార. సో నయనతార ఇంటర్వ్యూస్ ఇవ్వకపోడానికి కారణం ఇదన్నమాట. ఆమెను తప్పుగా అర్ధం చేసుకున్నారు కాని ఇంటర్వ్యూస్ ఇవ్వకపోడానికి ఆమెకి బలమైన కారణం ఉందని తెలుస్తుంది.                                   

 

మరింత సమాచారం తెలుసుకోండి: