కరోనా మహమ్మారి రోజు రోజుకీ తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల నష్టపోయిన చాలా రంగాల్లో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. థియేటర్లు మూతబడి, సినిమా షూటింగులు నిలిచిపోయి నిర్మాతలకి చాలా నష్టం వాటిల్లింది. అయితే తెలుగు చిత్రపరిశ్రమలో కోవిడ్ కారణంగా షూటింగ్ ఆపివేసిన మొదటి చిత్రం మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య.

 

 


కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. సామాజిక సందేశాలతో సినిమాలు తెరకెక్కించే కొరటాల శివ ఈ సినిమాతో మరో సందేశాన్ని ఇవ్వనున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. 

 

 

అయితే సమాజం పట్ల బాధ్యతతో కూడిన కొరటాల శివ తన సినిమాలని కూడా అదే విధంగా తెరకెక్కిస్తుంటాడు. ఆయన మొదటి సినిమా మిర్చి నుండి చూసుకుంటే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అయితే సమాజం పట్ల బాధ్యతగా ఉండే కొరటాల కరోనా టైమ్ లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వారిపై కామెంట్స్ చేసాడు. కరోనా సోకిందని తెలిసిన తర్వాత కూడా లెక్కచేయకుండా జనాల్లో తిరుగుతూ ఇతరుల ప్రాణాలకి ముప్పు ముప్పు కలిగిస్తున్న వారిని ఉద్దేశిస్తూ అలాంటి వారు వైరస్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. 

IHG

 


వైరస్ ఉందని తెలిసినా క్వారంటైన్ లోకి వెళ్లకుండా బయట తిరుగుతూ ఇతరుల ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టడం కరెక్ట్ కాదని చెబుతున్నాడు. ఇలాంటి వారు మరింత బాధ్యతగా ఉండాలని కోరుతున్నాడు. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే మెగాస్టార్ ఆచార్య షూటింగ్ స్టార్ట్ అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: