మన తెలుగు లో బాలకృష్ణ సినిమాల్లో మర్చిపోలేని సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా. ఈ సినిమాలో బాలయ్య నటన బోయపాటి దర్శకత్వం అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా మాస్ ని క్లాస్ ని అందరిని బాలయ్య ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ప్రతీ సీన్ ని కూడా చాలా అందంగా దర్శకుడు చూపించాడు. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే జనాలు మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. బాలయ్య నటన కోసం చూస్తూ ఉంటారు. 

 

అదే విధంగా జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా చేయగా ఆయన నటన కూడా ఈ సినిమాల్లో చాలా బాగా  ఆకట్టుకుంది అనే చెప్తారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడి తనను తాను చాలా బాగా మార్చుకున్నారు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత జగపతి బాబు కి ఒక రేంజ్ లో ఆఫర్లు వచ్చాయి అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది అని చెప్పవచ్చు. చాలా బాగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ పాట చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఆ పాటలో బాలయ్యను ఒక రేంజ్ లో చూపించారు. 

 

ఇక యుట్యూబ్ లో ఈ పాటను చాలా మంది వీక్షించారు. కోటి మందికి పైగా ఈ పాటను చూసారు. ఈ పాటలో బాలయ్యను చూసిన ఆయన ఫాన్స్ అయితే అది బాలయ్య రేంజ్ అంటూ సినిమా చూస్తూనే అరుపులు. ఆ విధంగా ఈ పాట ఒక రేంజ్ లో హిట్ అయింది అనే మాట వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: