మన తెలుగు లో చిన్న చిన్న హీరోలకు ఇప్పుడు అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. చిన్న హీరోలకు పెట్టుబడి పెట్టడం అనేది దాదాపుగా ఇప్పుడు నిర్మాతలు అసలు  ఆలోచన చేయడం లేదు అని స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చేస్తున్నారు అని అవసరం అనుకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక సినిమాను చేస్తే మంచిది అని చిన్న హీరోల సినిమాలు చేస్తే అనవసరంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది అనే భావన లో ఉన్నారు అనే ప్రచారం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. 

 

అయితే ఇప్పుడు స్టార్ హీరోల కంటే చిన్న హీరోల సినిమాలే బెస్ట్ అని టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలు ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. అవును ఇప్పుడు దిల్ రాజు సురేష్ బాబు సహా కొందరు స్టార్ నిర్మాతలు దాదాపుగా ఇదే ఆలోచనలో ఉన్నారు అని  అంటున్నారు. చిన్న హీరోలకు చాలా తక్కువగా పెట్టుబడి పెడితే ఓటీటీ లో సినిమా అమ్మేస్తే చాలా మంచి లాభాలు వస్తాయి అని భావిస్తున్నారు. అదే విధంగా చిన్న సినిమాల్లో కథ బాగుంది అనుకుంటే జనాలు హాల్ కి వచ్చి రెండు సార్లు అయినా చూసే అవకాశం అనేది ఉంటుంది అని అందుకే ఇప్పుడు చిన్న సినిమాలను చాలా ఫాస్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. 

 

ఇటీవల దిల్ రాజు ఒక చిన్న దర్శకుడి కి చెప్పారట. వరుసగా మూడు సినిమాలు చేద్దామని మంచి కథలు ఉంటే చెప్పాలి అని తాను రాబోయే రెండేళ్ళు కూడా అదే విధంగా ముందుకు వెళ్తా అని కాబట్టి మీరు అలా ప్లాన్ చెయ్యాలి అని తనకు చాలా సన్నిహితంగా ఉండే దర్శకుడికి చెప్పారు అని సమాచారం. సదరు దర్శకుడు కూడా అలాగే కష్టపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: