బికినీ వేయడం అంటే ఇపుడు ఏమంత కష్టం కాదు, వేయకపోతేనే వింతా విశేషం. ఎపుడో  ఎర్లీ నైన్టీస్ నాటి ట్రెడిషన్స్ ఫాలో అవుతామంటే నన్ను ముట్టుకోకు అంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. కాలానికి తగినట్లుగా  మారాలి. అలా కాకపోతే సెట్ లో నుంచి అవుట్ అవుతారు.  అ తరువాత పూర్తిగా అవుట్  డేటెడ్ కూడా అవుతారు.

IHG

ఇదంతా ఎందుకంటే కొత్తగా ఒక పాప బికినీ వేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆమె ఎవరో కాదు, లావణ్యా త్రిపాఠి, ఆమె ఫుల్ ట్రెడిషనల్ లుక్ తోనే ఇంతకాలం కనిపించింది. ఆమె అందాల రాక్షసిగా తన సొగసు చూపించింది. సోగ్గాడే చిన్ని నాయన అంటూ సీనియర్ హీరో నాగార్జున తో ఫుల్ శారీతోనే టోటల్ మూవీలో  దర్శనమిచ్చింది.

IHG

అటువంటి భామ ఇపుడు బికినీ అంటే డైజెస్ట్ చేస్తుకోవడం అడియన్స్ కి కష్టమే. కానీ ఈ భామకు ఇపుడే కెరీర్ గురించిన సీరియస్ నెస్ తెలిసి వచ్చిందంట. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తి అయినా కూడా స్టార్ ఇమేజ్ లేదు కదా కనీసం చాన్సులు కూడా లేవు.వెనక వచ్చినవారంతా ముందుకు పోతూంటే లావణ్య ఎక్కడో ఉండిపోయింది. దాంతో ఇపుడు ఆమెకు తెలివి వచ్చిందని అంటున్నారు.

IHG

ఆమె రవితేజా రమేష్ వర్మ మూవీలో ఓ బోల్డ్ టైప్ క్యారక్టర్ చేయడానికి రెడీ అయిందట. మొదట ఈ క్యారెక్టర్ కి నిధి అగర్వాల్ ని అనుకున్నా కూడా ఆమె కంటే కూడా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన లావణ్య ఒక్కసారి బికినీలో కనిపిస్తే ఆ కిక్కే వేరు అని ఫిల్మ్ మేకర్స్ డిసైడ్ అయ్యారట. దాంతో ఆమెకే చాన్స్ ఇచ్చారట. ఇక తాను గ్లామర్ డోస్ పెంచుతాను, ఎక్స్ పోజింగ్ కి కూడా రెడీ అంటూ లావణ్య క్లారిటీ ఇవ్వడంతో ఈ దెబ్బతో ఆమెకు ఆఫర్లు తన్నుకుంటూ వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: