సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబోలో రాబోయే సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటినుండో ఎదురు చూపులు చూస్తున్నారు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా, పలు కారణాల వలన అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అయితే మొదట్లో వీరిద్దరి కాంబో లో ఒక సినిమా తీయాలని దుర్గ ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఎంతో ఆశపడ్డారు. కానీ అది ఇప్పటివరకు కుదురకపోవడంతో, అది అసలు ఇప్పట్లో జరుగుతుందా అనే అనుమానం మొన్నటివరకు అందరిలోనూ కలిగింది. ఇక ఇటీవల ఎట్టకేలకు స్వయంగా ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా, స్వయంగా రాజమౌళినే తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని, అలానే ఆ సినిమాని దుర్గ ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ నిర్మిస్తారని తెలిపారు.

IHG'There is no hurry ...

అయితే అది ఎప్పుడు మొదలవుతుంది, స్టోరీ ఎలా ఉంటుంది అనేవి మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి భారీ పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి, పూర్తిగా దీనిపైనే శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని నెలలుగా కరోనా కారణంగా మన దేశంలో లాక్ డౌన్ విధించబడి సినిమాల షూటింగ్స్ కూడా బంద్ కావడంతో, ఎప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయా, అలానే ఎప్పుడెప్పుడు తమ సినిమాల షూటింగ్ ని మొదలెడదామా అని మిగతా సినిమాల వారితో పాటు ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా ఎంతో ఎదురుచూపులు చూస్తోంది. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరిస్థితులను చూస్తుంటే, ఇప్పట్లో షూటింగ్స్ మొదలయ్యే ఛాన్స్ లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. అలానే, ఇప్పటికే తన సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్, అతి త్వరలో దానిని వాయిదావేస్తునట్లు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. 

IHG

మొత్తంగా ఈ పరిస్థితులు అన్నింటినీ బట్టి చూస్తుంటే, అసలు ఇప్పట్లో మహేష్, రాజమౌళిల కాంబో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనబడడం లేదని, ఒకవేళ ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ అయినా, రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మొదలెట్టడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, కొంత గ్యాప్ అనంతరం వీరిద్దరి సినిమా మొదలై, ఆపై మెల్లగా షూటింగ్ పూర్తి చేసుకుని, అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి మరొక మూడేళ్లు పట్టినా పెట్టొచ్చని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. చూడబోతే పాపం ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశ ఇప్పట్లో నెరవేరే ఛాన్స్ కనబడడం లేదు. మరి ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి ...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: