టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ పోతినేని "ఇస్మార్ట్ శంకర్" సినిమా ముందు భయంకరమైన ప్లాపుల్లో ఉన్నాడు. ఈ సినిమా చేయకముందు చాలావరకూ చాక్లెట్ బాయ్ మరియు క్లాస్ ఇమేజ్ తో తనకంటూ ఇండస్ట్రీలో సపరేట్ క్రేజ్ రామ్ క్రియేట్ చేసుకున్నాడు. అటువంటి ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాపులు కావటంతో… ఇదే టైములో ఫుల్లు డిజాస్టర్ లో ఉన్నాడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇలాంటి తరుణంలో పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని తో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తీసి ఒకపక్క రామ్ కీ లైఫ్ ఇవ్వడంతో పాటు తాను కూడా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్ ని ఇప్పటివరకు అభిమానులు చూడని విధంగా అదే తరహాలో రామ్ కూడా చెయ్యని జోనర్ లో మాస్ కథాంశం నేపథ్యంలో తీసిన “ఇస్మార్ట్ శంకర్” రామ్-పూరి కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

 

చాలా వరకు ఇండస్ట్రీలో రామ్ దుకాణం సర్దుకునే టైం అయిందని అనుకుంటున్న టైమ్ లో పూరి జగన్నాథ్ అతనికి లైఫ్ ఇవ్వటంతో రామ్ అభిమానులు ఇప్పటికీ పూరిజగన్నాద్ అంటే ప్రత్యేకమైన అభిమానం సోషల్ మీడియాలో చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయి వచ్చే శనివారం జులై 18 వ తారీకుకి ఏడాది కానున్న తరుణంలో సోషల్ మీడియాలో రామ్ అభిమానులు పూరి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

ఇదే తరుణంలో సినిమా రిలీజ్ అయి ఏడాది అయినాగానీ… సినిమాకి సంబంధించిన సాంగ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు ఇంకా సృష్టించడం విశేషం. తాజాగా ఇటీవల సినిమాలో రామ్ ఇద్దరు హీరోయిన్ లతో కలిపి చేసిన "దిమాక్ ఖరాబ్" వీడియో సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏకంగా 120 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగులో రామ్ వేసిన స్టెప్పులు అప్పట్లో థియేటర్ల లో ప్రేక్షకులను ఆపకుండా విజిల్స్ వేసే విధంగా చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: