డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ముంబై ధారావి లో కొంత టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసి లాక్ డౌన్ తో నిలిపివేసి హైదరాబాద్ వచ్చేశారు పూరీ టీం. త్వరలో మళ్ళీ ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. కేవలం విజయ్ దేవరకొండ, అనన్య పాండేల మీదనే సాంగ్స్ అలాగే విజయ్ దేవరకొండ తో యాక్షన్స్ సీన్స్ ని తెరకెక్కించబోతున్నారు.

 

IHG

పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ అండ్ పూరి కనెక్ట్స్ బ్యానర్స్ మీద పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ ఏ హీరోతో సినిమా చేస్తాడన్నది ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. అందుకు కారణం రీసెంట్ గా పూరి జగన్నాధ్ త్వరలో తన డ్రీం ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నానంటూ అఫీషియల్ గా ప్రకటించాడు.

 

IHG

అయితే ఆ డ్రీం ఎప్పుడు అన్నది ఇంత వరకు పూరి వెల్లడించలేదు. వాస్తవంగా ఇప్పటి వరకు పూరి జగన్నాధ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే కొబ్బరికాయ కొట్టి సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టినప్పుడే రిలీజ్ చేస్తాడు. అంత పక్కాగా సినిమాని పూరి చేసి రిలీజ్ చేయడం పూరి కి ఉన్న స్టామినా అండ్ స్టైల్. కాని తన డ్రీం ప్రాజెక్ట్ విషయం మాత్రం ఇలా నాంచడం ఏంటో ఎవరికీ అర్థం కాకపోవడమే కాదు హీరోగా ఎవరిని ఫైనల్ చేస్తాడన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి పూరి డ్రీం ప్రాజెక్ట్ "జనగణమన" విషయంలో ఎందుకు ఇంతగా డైలమాలో ఉన్నాడో అర్థం కావడం లేదు. అయితే పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమా మాత్రం బాలకృష్ణ తో ఉండబోతుందన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: