విజయ్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. చిన్న హీరోలే తగ్గాలా లేదా అని ఆలోచిస్తున్న సమయంలో ఇళయదళపతి తగ్గాలని డిసైడ్ అయ్యాడు. రెమ్యునరేషన్ తగ్గించుకొని, మిగతా వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీంతో మన బాలీవుడ్ లోనూ చర్చలు మొదలయ్యాయి. ఇండస్ట్రీని కరోనా క్రైసిస్ నుంచి బయటపడేయడానికి మన హీరోలు తగ్గుతారా అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. 

 

విజయ్ కోలీవుడ్ లో టాప్ హీరో. రజినీకాంత్ మార్కెట్ ని దాటేసి నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. తమిళనాట కోట్లమంది కదిలించే స్టేజ్ లో ఉన్నాడు. ఇలాంటి హీరో కరోనా క్రైసిస్ తో ఇబ్బందుల్లో ఉన్న ఇండస్ట్రీని చూసి మారిపోయాడు. సినిమాకు వంద కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ హీరో.. నెక్స్ట్ మూవీ నుంచి పేమెంట్ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడు. సన్ పిక్చర్స్ లో మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు పేమెంట్ కట్ చేసుకుంటానని నిర్మాతలకు చెప్పాడట విజయ్.

 

విజయ్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడనే టాక్ రావడం ఆలస్యం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో చర్చలు మొదలయ్యాయి. తెలుగు హీరోలు ఎవరైనా తమంతట తాము రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని చెప్తారా.. ఇన్నాళ్లు ప్రొడ్యూసర్స్ నుంచి కోట్లకు కోట్లు తీసుకున్న టాప్ హీరోలు.. ఇపుడు నష్టాల్లో ఉన్న నిర్మాతలను ఆదుకోవడానికి పారితోషికాలు తగ్గించుకుంటారా అనే చర్చలు మొదలయ్యాయి. 

 

పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఇద్దరూ 40కోట్లకు పైగా తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ 30కోట్లు ఛార్జ్ చేస్తున్నారు.  సీనియర్ హీరోలు 10కోట్లు అందుకున్నారు. చిరంజీవి 40కోట్లకు పైగా కోట్ చేస్తున్నాడు. ఇక ఈ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ సగానికి సగం తగ్గుతుందని చెప్పొచ్చు. 


సినిమా  బడ్జెట్ లో హీరోల రెమ్యునరేషనే సగానికి పైగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. అందుకే స్టార్లు పేమెంట్ కట్ చేసుకుంటే.. పరిమిత బడ్జెట్ లోనే క్వాలిటీ సినిమా వచ్చే అవకాశముంది. మరి కళామతల్లి ముద్దుబిడ్డలుగా నేమ్, ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్లు నష్టాల్లో ఉన్న పరిశ్రమ కోసం పారితోషికం తగ్గించుకుంటారా.. లేకపోతే ఇప్పుడు కూడా కోట్లు కావాలంటారా అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: