బెంగాలీ బాంబ్‌షెల్ అంజనా బి. ఒక హాలీవుడ్ సినిమా కోసం సంతకం చేసినట్లు తాజా సమాచారం. జిల్లా ఘజియాబాద్, రైట్ యా రాంగ్, చష్మే బద్దూర్ వంటి సినిమాల్లో నటించి ఒంపుసొంపులు ఆరబోసిన ఈ బెంగాలీ భామ ఇటీవలే ఒక ప్రత్యేక ఫొటో షూట్‌లో పాల్గొన్నట్లు బాలివుడ్ కోడై కూస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న హాలివుడ్ దర్శకుడు డేవిడ్ ఎస్ వోల్ఫ్ ఇద్దరు నటులతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం లుక్ టెస్ట్ నిర్వహించినట్లు వినికిడి. అసలుపేరు అంజనా అంత హాట్ హాట్‌గా లేదని డేవిడ్ చెప్పడంతో ఆమె పేరును కూడా ఇటీవలే కాస్త మార్చుకుందట. భోజ్‌పురి చిత్రం యే మాటి మైన్ సాబ్ కుచ్ కథె లో అంజనా కీలక పాత్ర పోషించింది. గత అయిదేళ్లుగా అంకల్ సంజా కరో, సీ నో ఈవిల్ హియర్ వంటి నాటకాల్లో పాత్రలు పోషిస్తూ వచ్చిన అంజనా నేరుగా హాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం బాలివుడ్‌ని నివ్వెరపరుస్తోంది. డేవిడ్ ఎస్ వోల్ఫ్ తీయనున్నట్లు చెబుతున్న ఈ సినిమాలో కామసూత్ర పుస్తకంలోని కొన్ని భంగిమలు పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంకా అనేక శృంగార సన్నివేశాలు ఉంటాయని వీటిని స్కాట్ లాండ్, థాయ్ లాండ్, గోవా, పాండిచ్చేరితోపాటు దక్షిణ భారత దేశంలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా చిత్రించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: