సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న వారు చాలా లౌక్యంగా మాట్లాడుతారని, వ్యవహరిస్తారని ప్రసిద్ధి. అందుకే వారి మాటలు ఎవ్వరీని నొప్పించకుండా సాగుతుంటాయి. ముఖ్యంగా హస్యనటులు ఎప్పుడూ వివాదాల జోలికి పోరు. హీరో లేదా దర్శక, నిర్మాతలనో ప్రశంసిస్తూ తమ పబ్బం గడుపుతుంటారు. అయితే సినీ నటుడు ఆలీ, శుక్రవారం నాడు దీనికి మినహాయింపు ఇచ్చాడు. టాలీవుడ్ మిస్ హైదరాబాద్ 2012 ఫోటోస్ విడుదల వేడుకలకు హజరైన అలీ తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమాల్లో లోకల్ టాలెంట్ రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు. భారీ పారితోషకం తీసుకుంటూ, తెలుగు సినిమాను చిన్న చూపు చూస్తున్న పరాయి భాషా తారలపై ఎగిరి పడ్డాడు. ముఖ్యంగా అతను ఇలియానా తీరు పై విమర్శల వర్షం కురిపించాడు. ముంబాయ్ లో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్స్ లో సాదాసీదాగా గడిపే ఇలియానా వంటి తారలు హైదరాబాద్ కు వచ్చే సరికి ఫైవ్ స్టార్ హోటల్ కావాలని, బెంజి కారు కావాలని నిర్మాతను సతాయిస్తారని పేర్కొన్నాడు. తెలుగులో కంటే తక్కువ పారితోషకం ఇవ్వడమే కాకుండా, 15 రోజుల పాటు ప్రమోషన్ లో పాల్గొనాలని బర్ఫీ సినిమాకి తీసుకునేటప్పుడే ఇలియానాకు ఆ చిత్ర దర్శక,నిర్మాతలు కండీషన్ పెట్టారని, ఇలియానా దీనికి అంగీకరించిందని, అయితే ఇక్కడ భారీ గా పారితోషకం తీసుకుంటూ తెలుగు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో రాకుండా ఇలియానా తప్పించుకుని తిరుగుతాదని అలీ అన్నాడు. ఇలియానా వంటి వారికి ప్రోత్సాహం ఇవ్వకూడని, లోకల్ టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహిస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని అలీ అన్నాడు. అలీ మాటలు అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరీ ఆలోచింపచేశాయి. తెలుగు సినిమా పెద్దలు ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: