పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి షాకింగ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న గోపాల గోపాల మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకుంటుంది. పవన్ కల్యాణ్, వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' చిత్రం విడుదల సంక్రాంతికి ఉంటుందనే విషయాన్ని అభిమానులు సైతం నమ్మకంతో ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గోపాల గోపాల మూవీ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మొదట్లో ప్లాన్ చేసినప్పటికీ, తరువాత ఇది ఆచరణ సాధ్యం కాదని తెలుస్తుంది. దీనికి కారణం, సినిమా నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగుకు సంబంధించి ఇంకా సుమారు ఇరవై రోజుల వర్క్ బ్యాలెన్స్ గా వుంది. ఇందులో పవన్ వర్క్ కూడా వుంది. అలాగే, పవన్ కృష్ణుడి పాత్రకు చెందిన సీజీ వర్క్ కు కూడా మరింత సమయం అవసరం అవుతుంది. ఈ కారణాల వల్ల ఇది సంక్రాంతి రేసు నుంచి ఇక తప్పుకున్నట్టేనని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలుపుతామని చిత్ర నిర్మాతలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మూవీ సంక్రాతి బరి నుండి తప్పుకుంటే మొదటగా కలిసి వచ్చేది నందమూరి మూవీకే అని అంటున్నారు. ఎందుకంటే జూనియర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడ సంక్రాంతి బరిలోనే ఉండటంతో ఈ మూవీకి, పవన్ కళ్యాణ్ మూవీకి పోటి ఉంటుందని లెక్కలు వేశారు. ఇప్పుడు పవన్ మల్టీస్టారర్ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో, జూనియర్ మూవీకి కలిసొచ్చే విషయంగా టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: