డాన్స్ మాస్టర్ లారెన్స్ కెరీర్లో గుర్తుండిపోయే సూపర్ హిట్ చిత్రం ముని 2... అదేనండీ, కాంచన. ఆ సినిమాతో అందరినీ భయపెట్టడంలో సఫలమయ్యాడు లారెన్స్. అందుకే, ఆ భయాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట. ఈ సరికొత్త భయం పేరేంటో తెలుసా... ‘ముని 3’. దీనికి సంబంధించి కథను కూడా సిద్ధం చేసుకున్నాడట. అయితే, ఈ సినిమా నిర్మాణానికి ముందు మరికొన్ని పనులు చేయాల్సి ఉంది అంటున్నాడు. అవేంటంటే... ‘కాంచన’ ను మామూలుగా కాకుండా త్రీడీలోకి మార్చి భయానికి కొత్త అర్థం చెప్పాలనుకుంటున్నాడట. అంతేకాదు, తన గురువు ప్రభుదేవాలా అటు బాలీవుడ్ లోనూ అడుగు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట. కాంచన సినిమాను హిందీలో తీయాలనుకుంటున్నాడట. కాంచన అంటే గుర్తుకొచ్చే ప్రధాన పాత్ర... శరత్ బాబు. మరి, హిందీలో ఈ పాత్రకోసం లారెన్స్ ఎవరిని సంప్రదించాడో తెలుసా... హీరోలాంటి విలన్ సంజయ్ దత్ నట. ప్రస్తుతానికి సంజూ భాయ్ తన నిర్ణయం చెప్పలేదట. చెబితే మరో మాంఛి సినిమాను చూసే అవకాశం మనకు దక్కుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: