ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డం కలిగిన హీరోలకు ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఫిట్ నెస్. ప్రస్తుత పరిస్థితుల్లో యాక్టింగ్ కంటే ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం అనే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ తయారయింది. ఇది కొంత వరకూ మంచిదే అయినప్పటికీ, ఇదే జీవితంగా మారింది చాలా మంది సెలబ్రిటీలకు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న నవతరం హీరో నారారోహిత్. నందమూరి వంశంతో ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా నారారోహిత్ వరుస సినిమాలు చేస్తూ, తనదైన స్టైల్ ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. అయితే తాజాగా తను నటించిన రిలీజ్డ్ మూవీ రౌడీఫెలో పై అభిమానులు వద్ద నుండి ఓ విమర్శని అందుకున్నాడు. ఆన్ స్క్రీన్ పై నారారోహిత్ చాలా లావుగా కనిపించడంతో, అది హీరోయిజానికి కొద్దిగా ఇబ్బందిగా మారిందట. ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న నారారోహిత్, తన అప్ కమింగ్ ఫిల్మ్ లో కంప్లీట్ ఫిట్ నెస్ తో ముందుకు వస్తాను అంటూ అభిమానులకి ప్రామిస్ చేస్తున్నాడు. అందుకే అర్జెంటుగా బాడీ మీద దృష్టిపెట్టి పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకున్నాడు. ఐతే ఊరికే ఏదో ఎక్సర్‌సైజులు చేసి సన్నబడిపోవడం కాకుండా ఏకంగా సిక్స్ ప్యాక్‌కే ట్రై చేస్తానంటున్నాడు రోహిత్. ఈ విషయంపై నారా రోహిత్ మాట్లాడుతూ ‘‘రౌడీఫెలోలో బాగా లావుగా కనిపించానన్న విమర్శ వచ్చింది. తెరపై చూసుకున్నాక నాకు కూడా అదే అనిపించింది. అందుకే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. కొన్ని నెలల్లోనే కొత్త రోహిత్‌ను చూస్తారు. అలాగే నేను సిక్స్ ప్యాక్ కూడా చేసేద్దామని అనుకుంటున్నా’’ అని వెల్లడించాడు. అయితే పర్సనల్ ట్రైనర్ నారారోహిత్ ఫిజిక్ ని చూసి , తన బాడీలో నుండి దాదాపు 17 కేజీల కొవ్వు కరిగించాల్సిందే అని చెప్పాడంట. ప్రస్తుతం నారారోహిత్ తన ఫిట్ నెస్ పూర్తి కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: