సినిమాటోగ్రఫీ ,సంగీతం ,ప్రధాన పాత్రల నటనా ప్రదర్శన సినిమాటోగ్రఫీ ,సంగీతం ,ప్రధాన పాత్రల నటనా ప్రదర్శన సెకండ్ హాఫ్ ,దర్శకత్వం,ఎడిటింగ్ ,చిత్ర నిడివి ,నెమ్మదిగా సాగే కథనం ఆడి(సుమంత్ అశ్విన్) ఒక కాలేజీ స్టూడెంట్ , ఆ కాలేజీ లో పలువురు అబ్బాయిలకి అమ్మాయిలను ప్రేమించడం వలన పలు సమస్యలు వస్తుంటాయి. వీటన్నికి పరిష్కారం అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడకూడదు చూడకూడదు అప్పుడే వాళ్ళకి అబ్బాయిల ప్రాముఖ్యత ఏంటో అర్ధం అవుతుంది అని ఆ కాలేజీ అబ్బాయిలని ఒప్పిస్తాడు. ముందు అబ్బాయిలే ప్రేమని చెప్తారు అమ్మాయిలు చెప్పరా? అమ్మాయిల అందం గురించి అబ్బాయిలు కవితలు రాస్తారు అంటే అబ్బాయిలు అందంగా ఉండరా ? అమ్మాయిలు కవితలు రాయరా? అన్నది ఆడి వాదన.. ఇదే సమయంలో వీళ్ళ కాలేజీ లో చేరుతుంది అవంతిక(మృతిక) చేరగానే కాలేజీ లో పరిస్థితి చూసి ఎలాగయినా ఆడి ని తన ప్రేమలో పడేలా చేసి తను పెట్టిన రూల్ ని తనే బ్రేక్ చేసేలా చేస్తాను అని చెప్తుంది ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతుంది.. ఆడిని అవంతిక తన ప్రేమలో పడేసిందా లేదా ఆడి తన రూల్స్ కి కట్టుబడి ఉన్నాడా? అన్నదే మిగిలిన కథ .సుమంత్ అశ్విన్ మంచి ఈజ్ తో కూడిన పాత్రనే మరోసారి ఎంచుకున్నాడు అతనికంటూ సరికొత్త శైలిని సృష్టించుకున్నాడు, డైలాగ్స్ చెప్పడంలోను మరియు ఎమోషనల్ సన్నివేశాల వద్ద చాలా మెరుగైన ప్రదర్శన కనబరిచారు. డాన్స్ కూడా బాగా చేసారు.. మృతిక కి ఇది తెలుగులో మొదటి చిత్రం చూడటానికి అందంగాను ఉంది హావభావాలలో పరిపఖ్వత కూడా ఉంది కాని డైలాగ్స్ మాత్రం లిప్ సింక్ బొత్తిగా కుదరలేదు.. ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవలసింది.. తాగుబోతు రమేష్ , వైవా హర్ష , సురేఖ వాణి , సప్తగిరి , మధు మరియు తదితర నటీనటులు వారి పాత్ర మేరకు కనిపించి మెప్పించారు..కథ , సన్నని దారం ఈ చిత్ర కథ బరువు మొత్తం కథనం మీద పడింది కాని కథనం దగ్గరకి వచ్చేసరికి చాలా లోపాలు బయటకి వచ్చేసాయి ఒక స్థాయి దాటాక దారం లాంటి కథ తెగిపోయి ఎటువైపు వెళ్తుంది అనేది మరొక కొసకి కూడా తెలియనంత స్థాయికి చిత్రం చేరుకుంటుంది దానికి తగ్గట్టుగానే చిత్రం విభిన్నంగా ఉండాలన్న కసితో అన్ని పాత్రలను విచిత్రంగా తీర్చిదిద్దారు దర్శకుడు.. అన్ని మాములుగా ఉన్న పాత్రల మధ్య విభిన్నమయిన పాత్ర హైలెట్ అవుతుంది కాని అన్ని పాత్రలు విచిత్రంగా ఉంటె చూసే జనం కూడా అంతే విచిత్రంగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఏ ఒక్క పాత్రతో కనెక్ట్ కాలేని ప్రేక్షకుడు చిత్రాన్ని ఎప్పటికి తన సొంతం చేసుకోలేడు.. ఇక మొదటి సన్నివేశానికి చివరి క్లైమాక్స్ కి వచ్చేలోపు కథ అనవసర మలుపులు తిరిగేసి తప్పుడు గమ్యం చేరుకున్న ఫీలింగ్ వస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల మధ్య సమస్యని మధ్యలోనే మరిచిపోయి హీరో హీరోయిన్ సమస్యకి చేరుకోగానే కథ ఎక్కడ మొదలయింది ఎటు వైపు వెళ్తుంది అన్న క్లారిటీ జనం కి ఉండదు దర్శకుడికి ఉన్నట్టు కనిపించదు.. మాటలు కూడా ఆకట్టుకోలేదు బలమయిన సన్నివేశాలలో పేలవమయిన మాటలు .. దర్శకత్వం పరంగా వేమా రెడ్డి ఘోరంగా విఫలం అయ్యాడు మంచి సన్నివేశాలు ఉన్న చోట కూడా అతని పేలవమయిన టేకింగ్ ఆ ఫీల్ ని సృష్టించలేకపోయింది.. సాయి శ్రీరామ్ అద్భుతమయిన ప్రతిభ కనబరిచారు.. కలర్స్ ని చూపించిన విధానం లొకేషన్స్ చూపించిన విధానం చాలా బాగుంది .. ఎడిటర్ కి ప్రేక్షకుల మీద కక్ష ఉన్నట్టు ఉంది రెండవ అర్ధ భాగంలో చాలా సన్నివేశాలు అవసరం లేకపోయినా కూడా చాలా సన్నివేశాలను కత్తిరించకుండా వదిలేసారు.. మిక్కి జే మేయర్ అందించిన సంగీతం ఈ చిత్ర హైలెట్స్ లో ఒకటి నేపధ్య సంగీతం కూడా బాగుంది కాని బలమయిన సన్నివేశాలే లేనప్పుడు సంగీతం ఎలా ఉంటె ఏంటి .. ఉన్న రెండు ఫైట్స్ బాగున్నాయి మహిస్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఇలువల వారి నిర్మాణ విలువలు బాగున్నాయి ..టీన్ రొమాంటిక్ చిత్రాలంటే భూతులతో నింపేస్తున్నారు ఈ మధ్యన.. ఈ చిత్రం ఆ కోవలోకి చేరదు కాని ఈ చిత్రం తనకంటూ ఒక కొత్త కోణాన్ని ఆరంభించింది ఆ కోణం ఏంటంటే చిత్రంలో ఎం చెప్తున్నమో కూడా క్లారిటీ లేకపోవడం చివరికి వచ్చేలోపు చిత్రాన్ని చిరాగ్గా ముగించడం ఇంకా చాలా కోణాలు ఉన్నాయి అన్ని నెగెటివ్ గానే ఉన్నాయి. టీన్ కామెడీ లేదా టీన్ రొమాంటిక్ ప్రయత్నించే సమయంలో అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్యన వచ్చే గొడవల మీద కాకుండా సమస్యల మీద దృష్టి పెడితే మంచిది అని దర్శకులకి సలహా .. ఈ చిత్రం మొత్తం అబ్బాయిల మీద అమ్మాయిల అధిపత్యం మరియు అమ్మాయిల మీద అబ్బాయిల ఆధిపత్యం ఇలా సాగుతుంది ఇది చాలదు అని ప్రేమ అనేది ఎవరు చెప్తే ఏంటి అని ఒక్క లైన్ లో చెప్పాల్సిన విషయాన్ని పారాలు పారాలు స్టోరీలు చెప్పి చిరాకు పెట్టించేసారు.. ఈ చిత్రం చూడటానికే ఒక్క కారణం కూడా దొరకదు కేవలం సినిమాటోగ్రఫీ కోసం ఎప్పుడో ఒకసారి వచ్చే పాటల కోసం రెండున్నర గంటల నీరసాన్ని భరించగలరేమో అనుకుంటే ప్రయత్నించండి నా సలహా అయితే "వద్దు"..Sumanth Ashwin,Rehana,Vema Reddy,Sukumar,Mickey J Meyer.చక్కిలిగింత : నవ్వించదు.. విసిగిస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: