సంపూర్నేష్ బాబు , సినిమాటోగ్రఫీ , రన్ టైంసంపూర్నేష్ బాబు , సినిమాటోగ్రఫీ , రన్ టైంనో స్టొరీ లైన్ , అర్ధం పర్ధం లేని కథ , నవ్వించలేకపోవడం , పేరడీ లేని సొల్లు డైలాగ్స్ , ఎడిటింగ్ , చెవులు పగిలిపోయే లౌడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , డైరెక్షన్

సింగం 123 అనేది ఒక స్పూఫ్ సినిమా.. కావున ఇందులో కథ అనేది ఉండదు.. నాలుగు పంచ్ డైలాగులు, ఐదు స్పూఫ్ సీన్స్ మాత్రమే ఉంటాయి.. ఇక రెండున్నర గంట పాటు మాకు చెప్పిన స్పూఫ్ కథ విషయానికి వస్తే.. సింగరాయకొండ ప్రజల్ని పట్టి పీడిస్తున్న అతికిరాతకమైన రౌడీ లింగం(భవాని). లింగం ఫాలో అయ్యేది ఆ ఊర్లో ‘పోలీస్ స్టేషన్ కడితే కూల్చేస్తా, పోలీస్ అనే వాడు అడుగుపెడితే వాన్ని కాల్చేస్తా’. అలా ఉన్న సింగరాయకొండ ప్రజల్ని కాపాడటం కోసం హోం మినిస్టర్ ఆ ఊర్లోని సీక్రెట్ పోలీస్ స్టేషన్ కి సీక్రెట్ ఆఫీసర్ గా సింగం 123(సంపూర్నేష్ బాబు)ని అపాయింట్ చేస్తాడు. అక్కడికి వచ్చాకే సింగం 123 కి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన తన తండ్రి జంగం(పృథ్వి)ని లింగం చంపేసాడని తెలుస్తుంది. అదే టైంలో లింగం సింగం 123 పై అటాక్ చేసి బావిలో వేసి చంపేస్తాడు. కానీ దేవుడి దయవల్ల సింగం 123 బతికి ఆ బావిలో నుంచి ఈదుకుంటూ సౌత్ ఆఫ్రికాలోని తన తండ్రిని కలుసుకుంటాడు సింగం 123. ఈ కథ అంతా తెలుసుకున్న జంగం తన కొడుకు సింగం 123కి అన్ని విద్యల్లోనూ ట్రైనింగ్ ఇచ్చి సింగరాయకొండకి పంపిస్తాడు.. అలా వచ్చిన సింగం 123 లింగం ఆగడాలను ఎలా అరికట్టాడు.? సింగరాయకొండ ప్రజల్ని ఎలా కాపాడాడు అన్నదే మీరు ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోవాల్సిన మిగిలిన కథ..

సినిమాలో ఎక్కువ పాత్రలని పెట్టలేదు.. సింగల్ హ్యాండ్ అన్నట్టు.. సంపూర్నేష్ బాబుతోనే లాగించేసారు.. ఇక ఎప్పటిలానే సంపూర్నేష్ బాబు తన డైలాగ్ డెలివరీ మరియు తన మార్క్ కామెడీతో ఓకే అనిపించాడు. కానీ ఇకనైనా తను కాస్త దృష్టి పెట్టి తను చేసే ఓవరాక్షన్ మీద కేర్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువ చేస్తే నెక్స్ట్ సినిమా నుంచి చూడటం కష్టం. ముఖ్యంగా సంపూర్నేష్ బాబు తన తదుపరి సినిమాల స్క్రిప్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తన కెరీర్ కే మంచిది. ఇక బెంగుళూరు బ్యూటీ సనం శెట్టి తన ఫస్ట్ తెలుగు సినిమాతో మెప్పించలేకపోయింది. జస్ట్ ఒక గ్లామర్ అట్రాక్షన్ గా మాత్రమే మిగిలింది. భవాని మరియు వైవ హర్షలు తమ పాత్రలకు న్యాయం చేయలేకపోయారు. దానికి కారణం మంచు విష్ణు అందించిన స్క్రీన్ ప్లే కారణం.. అన్నపూర్ణమ్మ, పృథ్విలు తమ చిన్న చిన్న పాత్రల్లో ఓకే అనిపించారు. అంతకు మించి చెప్పుకోవాల్సిన నటీనటులెవరు లేరు..  

డా. ఎం. మోహన బాబు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు ఇప్పటి వరకూ నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అలాంటి నటుడు – నిర్మాత మొదటిసారిగా కథ – స్క్రీన్ ప్లే రచయితగా మారి చేసిన మొదటి పోలీస్ కామెడీ(పేరడీ ఫిల్మ్) మూవీ సింగం 123. మంచు విష్ణు రచయితగా అనుకోని విధంగా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఆడియన్స్ మెప్పించడంలో స్క్రిప్ట్ దారుణంగా విఫలమైంది. విష్ణు అనుకున్న స్టొరీ లైన్ అస్సలు బాలేదు, దానికి తోడు అనుకున్న లైన్ ని ఒక ప్రాపర్ కథలా మలచలేకపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన పేరడీ సినిమాల్లో ది వరస్ట్ సినిమా సింగం 123. ఈ సినిమా నెరేషన్ మొదటి సీన్ నుంచే చూసే ఆడియన్స్ కి నిద్ర వచ్చేలా చేస్తుంది. చాలా ఊహాజనితంగా అనిపించే బోరింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. సింగం 123లో కూడా సుడిగాడు సినిమాలానే అన్ని సినిమాలలోని సూపర్ సక్సెస్ఫుల్ సీన్స్ ని కాపీ కొట్టి వాటికి పేరడీగా సీన్స్ ని రాసుకోవడం కామన్ పాయింట్. కానీ ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా ఫెయిల్యూర్. విక్రమార్కుడు, లెజెండ్, రేసుగుర్రం, గబ్బర్ సింగ్, శివమణి, స్టాలిన్, సింహాద్రిల స్పూఫ్ మరియు లివింగ్ రిలేషన్ షిప్ మీద చేసిన ఓ హారిబుల్ స్పూఫ్ సీక్వెన్స్ ఆడియన్స్ బుర్రల్ని ఫ్రై చేసేస్తాయి. ఈ మధ్యకాలంలో కమర్షియాలిటీ కోసం చాలా సినిమాల్లో కమెడియన్స్ ని పెట్టుకొని బాగా హిట్ అయిన సినిమాల్లోని సీన్స్ ని పేరడీ చేస్తూ అప్పుడప్పుడు ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే స్పూఫ్ సినిమాగా వచ్చిన సింగం 123 ఆడియన్స్ ని నవ్వించడంలో ఫెయిల్ అయ్యింది. ఇదొక పేరడీ సినిమా కదా అని మొదట్లో అన్నీ ఓర్చుకొని సినిమా చూడటం మొదలు పెట్టినా సినిమా పూర్తయ్యేసరికి టాలీవుడ్ లో దీనికన్నా మంచి పేరడీ ఫిల్మ్ చేయలేరా అనే భావన కలుగుతుంది. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది అవుట్ డేటెడ్ కామెడీ మరియు ఇప్పటి ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని ఒక్క కామెడీ సీన్ కూడా రాసుకోలేదు. చెప్పాలంటే ఈ చిత్ర టీం ఇటీవలే వచ్చిన రేసు గుర్రం, లెజెండ్, ఆగడు లాంటి సినిమాల నుంచి ఇన్స్పైర్ అయినప్పటికీ ఆ సీన్స్ ని ట్రీట్ చేసిన విధానం మాత్రం చాలా పాతగా ఉంది. స్వతహాగా నేను కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాను కానీ ఈ సినిమాలో అస్సలు నవ్వించేలా ఏమీలేవు. చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన లయన్ సినిమాలో కూడా కొన్ని సీన్స్ నవ్వించాయి కానీ సింగం 123లో మాత్రం అసలు నవ్వులే లేవు.. నో లాఫ్స్ అటాల్.. ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. శేషు కెఎంఆర్ మ్యూజిక్ ఓకే.. ‘ఎదో లో మాయ’ అనే డ్యూయెట్ సాంగ్ బాగుంది. ఈ సినిమాలో రాసిన ప్రతి పవర్ఫుల్ డైలాగ్ ఈ మధ్య వచ్చిన ఏదో ఒక సినిమాని గుర్తు చేసేలా ఉంది. కానీ ఒక్క డైలాగ్ కూడా పేలలేదు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్, యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా బాగా షూట్ చేసాడు. పి. సతీష్ కంపోజ్ చేసిన స్పూఫ్ ఫైట్స్ యావరేజ్ గా ఉన్నాయి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అందించిన నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.

ఈ చిత్ర టీం పేరడీ అనే పదానికి సరైన అర్థం తెలుసుకోకుండానే సింగం123 సినిమాని తీసినట్టున్నారు. పేరడీ అనే పదాన్ని మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చే రెండవ డెఫినిషన్.. ఒక పర్టిక్యులర్ రైటర్ లేదా ఆర్టిస్ట్ లేదా ఒక జోనర్ సినిమాని కాస్త ఎక్కువ చేసి పర్ఫెక్ట్ కామెడీ ఎఫెక్ట్స్ తో చెప్పడమే పేరడీ మూవీ. ఇది కూడా చూడకుండానే ఈ సినిమాకి పనిచేసిన టీంకి ఇదొక చెరపలేని మచ్చ. మీకు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఒపీనియన్ నాశనం అయిపోవాలన్నా, వయోలెన్స్ ని విపరీతంగా ప్రమోట్ చేయాలన్నా, మీనింగ్ లేని మెసేజ్ లు వినాలన్నా, సెలబ్రిటీస్ ని పక్కకి నెట్టేయాలన్నా, మీ జేబులో ఉన్న డబ్బు నష్టపోవాలన్నా సింగం 123 సినిమా చూడండి. నా వరకూ మీకిచ్చే సలహా మాత్రం ఈ సినిమాకి దూరంగా ఉండి మీ మనీ సేవ్ చేస్కొండి. అలాగే ఆడియన్స్ పెట్టే మనీకి తగ్గా వర్త్ ఈ సినిమాలో లేదు.. లేదు.. ఓవరాల్ గా మనకు తెలిసిన కొన్ని ఫేస్ లు మరియు పలు సినిమాల పేరడీ సీన్స్ సింగం 123లో ఉన్నా మిమ్మల్ని నవ్వించే సీన్స్ లేకపోవడం బాధాకరమైన విషయం.. సింప్లీ స్కిప్ ‘సింగం 123’.. కుదిరితే ఇలాంటి సినిమా ఒకటి రాలేదని ఫిక్స్ అయిపోండి..

Sampoornesh Babu,Akshat Sharma,Manchu Vishnu,Seshu KMR.పంచ్ లైన్ : సింగం 123 – ది బెస్ట్ ఫెయిల్యూర్ పేరడీ మూవీ.!

మరింత సమాచారం తెలుసుకోండి: