ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫిల్మ్ కెరీర్ పై భారీ అంచనాలను పెట్టుకున్న హీరో సునీల్. ఒక వైపు యంగ్ హీరోలు దూసుకుపోతుంటే, ఈ కమెడియన్ కం హీరో మాత్రం ఒక్కోక్క మూవీకీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సునీల్ ని హీరోగా యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులు సునీల్ వద్ద నుండి డిప్రెంట్ సబ్జెట్ తో వచ్చే మూవీలను ప్రేక్షకులు అదరిస్తున్నారు.

కానీ సునీల్ లేటుగా హీరో అవతారం ఎత్తి, వెరీ రొటీన్ ఫార్ములా ఉన్న ప్రేమ కథలను ఎంచుకుంటున్నారు. అందుకే సునీల్ కెరీర్ గ్రాఫ్ ఆశించినంతగా లేదు. దీంతో సునీల్ చేస్తున్న మూవీలకి మార్కెట్ పెరిగే అవకాశం కనిపించటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సునీల్ పై జోక్స్ పేలుస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

సునీల్ ప్రతి మూవీకి తన బాడీని ఎక్స్ పోజ్ చేయాలని చూస్తున్నాడు. గతంలో సిక్స్ ప్యాక్స్, ఆ తరువాత ఫిట్ గా ఉన్న బాడీ, ఇప్పుడు తను నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ సునీల్ షర్ట్ లెస్ గా కనిపించనున్నాడు. ”దీంతో కండలు పెంచితే కాదు, కథను చూసుకో”అంటూ సునీల్ పై కౌంటర్ పేలుస్తున్నారు.

కథల విషయంలో సునీల్ చాలా పూర్ సెలక్షన్స్ చేస్తున్నాడు. వైవిధ్యభరితమైన కామెడీ జోనర్ కథలను ఎంచుకుంటే సునీల్ కి బాగా సూట్ అవుతాయి. స్టార్ హీరోలు చేసే కథలను ఎంచుకుంటే సునీల్ కి అవి సూట్ అవ్వవు అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: