టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ..తరుణ్ భాస్కర ద్శకత్వంలో ‘పెళ్లిచూపులు’సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాలా అమాయకంగా..నవ్వించే పాత్రలో నటించాడు. ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఓకేసారి ప్రభంజనం సృష్టించాడు.
వాస్తవానికి ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ లో నటించినా..అర్జున్ రెడ్డి పాత్రలో న్యాయం చేశాడని యూత్ బాగా ఎట్రాక్ట్ అయ్యారు. అప్పటి నుంచి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’సినిమాతో మరో ట్రెండ్ సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. తెలుగు లోనే కాదు తమిళంలో ‘నోటా’తో అడుగు పెట్టాడు. గీత గోవిందం,టాక్సీవాలా' విజయాలతో విజయ్ దేవరకొండ మంచి జోరుమీదున్నాడు.
విజయ్ హీరోగా ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోతున్నాయి.ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో మే 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడట. టీజర్ రిలీజ్ కి ఈ నెల 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.