టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమ్ము దులిపే డ్యాన్స్ హీరోలలో మెగా హీరోలు ముందుంటారు. ముఖ్యంగా రామ్ చరణ్- అల్లు అర్జున్ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా స్టెప్పులతో వెండితెరపై అదరగొడుతుమ్టారు. ఇదిలా ఉండగా గతంలో లారెన్స్ ప్రభుదేవా కలిసి నటించిన స్టైల్ సినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ ఇటీవల స్టైల్ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వార్తలపై స్పందించారు.
ఈ సినిమా సీక్వెల్ చేయాలని ఎప్పటి నుండో నాకో ఆలోచన ఉందని లగడపాటి శ్రీధర్ అంటూ ఈ సినిమా విషయంలో లారెన్స్ కలుగజేసుకుంటే కచ్చితంగా ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం ఖాయమని లారెన్స్ ఆసక్తి చూపిస్తే బాగుంటుందని కామెంట్ చేశాడు. మరోపక్క తాజాగా ఇటీవల కాంచన 3 చిత్రం విడుదల అయిన నేపథ్యంలో లారెన్స్ మీడియాతో మాట్లాడుతూ స్టైల్ 2 చేయాలని నాకు కూడా ఉంది.
అయితే టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్‌లతో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తారక్ కూడా సినిమాల చేస్తే బాగుంటుందని ముగ్గురు కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుందంటూ మీడియా వారితో జోక్‌గా లారెన్స్ అనడం జరిగింది. అయితే తారక్ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ అల్లు అర్జున్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తే అదిరిపోతుందని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.