అక్కినేని కుటుంబం నుండి వెండితెరకు పరిచయమైన ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్టు పడని అక్కినేని అఖిల్ కెరియర్ గురించి తండ్రి అక్కినేని నాగార్జున తెగ బాధ పడిపోతున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య సక్సెస్ ఫుల్ హీరోగా అక్కినేని అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుని వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కూడా అదే స్థాయిలో ఉండాలని అక్కినేని బ్రాండ్ నిలబెట్టాలని తెగ మదన పడిపోతున్న నాగార్జున అఖిల్ కి కచ్చితంగా హిట్టు పడాలని ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Related image

ఈ నేపథ్యంలో తాను నటిస్తున్న మన్మధుడు 2.. సినిమా కన్నా ఎక్కువ ఫోకస్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నటిస్తున్న సినిమా పై ఎక్కువగా పట్టించుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి గత పది సంవత్సరాల నుండి సరైన హిట్ లేని నేపథ్యంలో అటువంటి డైరెక్టర్ చేతిలో అఖిల్ కెరీర్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ పనితనంపై నాగార్జున డౌట్ పడుతున్నట్లు ఫిలింనగర్ టాక్.

Image result for bommarillu <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BHASKAR' target='_blank' title='click here to read more about BHASKAR'>bhaskar </a>nagarjuna

అంతేకాకుండా ఈ సినిమా ప్రతి సన్నివేశం సీన్ కూడా నాగార్జున దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు ఈసారి ఎలాగైనా అఖిల్ కి హిట్ పడాలని ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారట. గతంలో పెద్ద కొడుకు నాగచైతన్య కి గీతా ఆర్ట్స్ బ్యానర్లో 100% లవ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ పడింది ఇదే క్రమంలో అఖిల్ కి కూడా అదే స్థాయిలో హిట్టు పడాలని నిర్మాత అల్లు అరవింద్ తో నాగార్జున అన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: