వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ఇటీవల విడుదలైంది. తన కెరియర్ లో 25వ సినిమా అయినా ‘మహర్షి’ విడుదలయ్యిన ప్రతి చోట సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ మహేష్ బాబు కి ఫ్రెండ్ పాత్రలలో నటించాడు.

Image result for maharshi allari naresh

అయితే గత కొంత కాలం నుండి కమెడియన్ అల్లరి నరేష్ చేస్తున్నావా సినిమాలు ఫ్లాప్ అవడంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రయోగాత్మకంగా స్టార్ హీరో పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన అల్లరి నరేష్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ ఈ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం నా జీవితానికి ఒక చక్కటి మార్గాన్ని వెతుకుంటున్న సమయంలో 2002 మే10వ తేదీ ఇదే రోజున అల్లరి చిత్రంతో నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే ఆ చిత్రంలో రవి అనే పాత్ర పోషించాను.

Related image

మల్ళీ అదే రోజు మహర్షి సినిమాలోనూ రవి అనే పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఇప్పటివరకు నేను మొత్తం 55 సినిమాలు పూర్తి చేసుకున్నాను. మహర్షి సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం కష్టపడ్ద ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. మొత్తం మీద అల్లరినరేష్ వ్యాఖ్యలు వింటున్న చాలామంది ఖచ్చితంగా ‘మహర్షి’ సినిమా అల్లరి నరేష్ కి పునర్జన్మ లాంటిదని అంటున్నారు సినిమా విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: