ప్ర‌ముఖ భార‌తీయ సినీ న‌టిమ‌ణి దియా మీర్జాకు అరుదైన గౌర‌వం ల‌భించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐక్య‌రాజ్య స‌మితి సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల ( ఎస్ డి జి) బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఆరుగురిని ఎంపిక చేసింది. అందులో ఇండియాకు చెందిన న‌టి దియా కూడా ఒక‌రుగా ఉన్నారు. నైజారియా, చాద్, ద‌క్షిణాఫ్రికా, ఇరాక్, బ్రెజిల్ దేశాల నుంచి ఒక్క‌రొక్క‌రి చొప్పున ఎంపిక చేశారు. కొత్త అంబాసిడ‌ర్ల‌తో క‌లిసి మొత్తం 17 మంది ఉండే ఈ స‌భ్యులు ఆక‌లి, పేద‌రికాని రూపు మాప‌డం, అంద‌రికీ ఆరోగ్య సంర‌క్ష‌ణ క‌ల్పించే దిశ‌గా కృషి చేస్తార‌ని ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియా గ‌టెర‌స్ వెల్ల‌డించారు. దియా మీర్జా మొద‌టి నుంచి భిన్నంగా ఆలోచించారు. 


న‌టీమ‌ణిగా పేరు తెచ్చుకున్నా..సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. దీంతో అరుదైన గౌర‌వం ఈ సంద‌ర్భంగా ఆమెకు ద‌క్కింద‌నే చెప్పాలి. దియా మీర్జా 15 సెప్టెంబ‌ర్ 1980లో జ‌న్మించారు. మోడ‌ల్ గా, న‌టిమ‌ణిగా, నిర్మాత‌గా , అంద‌గ‌త్తెగా  పేరు తెచ్చుకున్నారు. మిస్ ఏసియా ప‌సిఫిక్ 2000 టైటిల్‌ను కూడా గెల్చుకున్నారు ఆమె. బాలీవుడ్‌లో న‌టించినా ఆమె సామాజిక సేవ చేయ‌డం మానుకోలేదు. 2001లో రెహ‌నా హై తేరే దిల్ మే సినిమాలో మొద‌టి సారిగా న‌టించారు. 2004లో తుమ్‌సా న‌హీ దేఖా పిక్చ‌ర్‌లో , 2006లో ల‌గే ర‌హో మున్నా భాయ్ మూవీలో న‌టించి మెప్పించారు. 2007లో హానీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటిడ్‌, లోకంద్ వాలా, 2008లో క్రేజీ4 , 2018లో సంజూ సినిమాల‌లో న‌టించారు. నిర్మాణ రంగంలోకి దియా ఎంట‌ర్ అయ్యారు. 


త‌న భ‌ర్త సాహిల్ సంఘాతో క‌లిసి బార్న్ ఫ్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరుతో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లోకి ప్ర‌వేశించారు. 2011 అక్టోబ‌ర్ 7న ల‌వ్ బ్రేక‌ప్స్ జింద‌గీ పేరుతో సినిమా నిర్మించి రిలీజ్ చేశారు. దియా తండ్రి ఫ్రాంక్ హ్యాండ్రిచ్ గ్రాఫిక్, ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన‌ర్‌గా పేరొందారు. అంతేకాకుండా ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్‌గా రాణించారు. మ్యూనిచ్ న‌గ‌రంలో ఇంటిరియ‌ర్ డిజైన‌ర్‌గా వినుతికెక్కారు. త‌ల్లి దీపా కూడా తండ్రి లాగే ఇంటిరియ‌ర్ డిజైన‌ర్. మ‌ద్యం, డ్ర‌గ్స్ బారిన ప‌డిన వారిని మార్చే ప‌నిలో సామాజిక సేవ చేస్తున్నారు. దియా నాలుగేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు త‌ల్లిదండ్రులు వేరుప‌డ్డారు. త‌ల్లి అహ్మ‌ద్ మీర్జాను పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న హైద‌రాబాద్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్య‌క్తి. 2003లో స్టెప్ ఫాద‌ర్ చ‌నిపోయారు. ఖైర‌తాబాద్‌లోనే ఉంటూ ..విద్యార‌ణ్య హై స్కూల్‌లో దియా చ‌దువుకున్నారు. స్టాన్లీ జూనియ‌ర్ కాలేజీలో ఇంట‌ర్ చ‌దివారు. అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్శిటీలో డిగ్రీ పొందారు.


 ఒక‌టి ఏప్రిల్ 2014లో సాహిల్ సంఘాతో ఎంగేజ్ మెంట్ కుదుర్చుకున్నారు. 18 అక్టోబ‌ర్ 2014లో పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీలోని అవుట్ స్క‌ర్ట్స్‌లోని ఛ‌త్తార్ పూర్ లో ఉంటున్నారు. దియా మీర్జా అద్భుత‌మైన తెలివితేట‌ల‌ను క‌లిగి ఉన్నారు. కాలేజీలో ఉండ‌గానే మీడియా ఫ‌ర్మ్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. నీర‌జ్ మ‌ల్టీ మీడియా స్టూడియోకు స‌పోర్ట్‌గా ఉన్నారు. ప్రింట్, టీవీ క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్స్ కు మోడ‌ల్‌గా ప‌నిచేశారు. లిప్ట‌న్, వాల్స్ ఐస్ క్రీం, ఇమామి, త‌దిత‌ర కంపెనీల‌కు మోడ‌ల్‌గా ఉన్నారు. మిస్ ఏసియా ప‌సిఫిక్ కాంపిటిష‌న్ లో గెలుపొంద‌డంతో ఒక్క‌సారిగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్ర‌చారం ల‌భించింది. మోడ‌లింగ్ అసైన్‌మెంట్స్ చేశారు. సంజ‌య్ ద‌త్ బ‌యో పిక్ సినిమాలో భార్య మాన్య‌తా ద‌త్ పాత్ర‌లో దియా న‌టించారు. ఇండియాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించింది ఈ మూవీ. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. 


ఇఫా 2012 గ్రీన్ అవార్డు పొందారు. హెచ్ఐవీ, క్యాన్స‌ర్ పేటెంట్స్ కు స‌పోర్ట్‌గా ఉన్నారు. పేటా, అడాప్ట్, క్రై స్వ‌చ్ఛంధ సంస్థ‌ల‌కు పూర్తిగా స‌హ‌క‌రించారు. న‌ర్మ‌దా బ‌చావో ఆందోళ‌న్‌కు సంపూర్ణ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు దియా మీర్జా. హిందూస్తాన్ టైమ్స్, ఇత‌ర ప‌త్రిక‌ల్లో దియా వివిధ అంశాల‌పై ఆర్టిక‌ల్స్ రాస్తున్నారు. 2000లో ఫెమినా మిస్ ఇండియా నిర్వ‌హించిన పోటీలో దియా మీర్జా ర‌న్న‌ర్ అప్ గా నిలిచారు. మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ అవాన్, మిస్ క్లోజ్ అప్ స్మైల్ ..మిస్ ఇండియాగా ఎంపిక‌య్యారు. తారా అన్నే ఫోనేసియా అవార్డు పొందారు. ఈ పుర‌స్కారం అందుకున్న మొద‌టి భార‌తీయురాలు దియా మీర్జా ఒక్క‌రే. రేడియో మిర్చి ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేప‌ట్టారు. కోకోకోలా ఫౌండేష‌న్ కోసం ప‌నిచేశారు. వేల్స్ జూలాజిక‌ల్ పార్క్ లో కొన్ని జంతువుల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. 


అమీర్ ఖాన్ తో క‌లిసి న‌ర్మ‌దా ఆందోళ‌న్‌లో విస్తృతంగా పాల్గొన్నారు. పానాసానిక్ కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా దియాను ఎంపిక చేసింది. స్వ‌చ్ఛ్ భారత్ మిష‌న్ చేప‌ట్టిన స్వ‌చ్చ్ సాథి కార్య‌క్ర‌మానికి దియా మీర్జా ప్ర‌చారం చేశారు. పిల్ల‌ల‌ను ప్రేమించాలి..వారి హ‌క్కులు కాపాడాల‌ని కోరుతూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. 2017లో వైల్డ్ లైఫ్ ట్ర‌స్ట్ ఇండియా అంబాసిడ‌ర్‌గా నియ‌మింప‌బ‌డ్డారు. ఏనుగుల‌ను సంర‌క్షించు కోవాల‌ని కోరుతూ ముంబ‌యిలో గ‌జ యాత్ర‌ను మీర్జా ప్రారంభించారు. యుఎన్ ఎన్విరాన్ మెంట్ గుడ్ విల్ ఇండియా అంబాసిడ‌ర్‌గా ప‌నిచేశారు. ఎన్నో అవార్డులు..పుర‌స్కారాలు పొందారు దియా మీర్జా. ఆమె న‌టీమ‌ణి మాత్ర‌మే కాదు ...మాన‌వ‌త్వం క‌లిగిన మ‌నిషిగా త‌న జీవితాన్ని సార్థ‌క‌త చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: