ఏపి ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఫ్యాన్ గాలికి టిడిపి, జనసేన అడ్రెస్ లేకుండా పోయాయి. కేవలం 24 సీట్లతో టిడిపి సరిపెట్టుకుంటే జనసేన మారీ దారుణంగా ఒక్క చోట మాత్రం విజయం సాధించింది. తన గెలుపుపై ధీమాగా ఉన్న పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ ఓడడం ఒక ఎత్తైతే పవన్ ఓడిపోవడం ఇక్కడ చర్చలకు దారి తీస్తుంది.


2014 ఎన్నికల ముందే పార్టీ ఎనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే అప్పుడు టిడిపి, బిజేపికి సపోర్ట్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఈసారి ఒంటరి పోరుకి దిగాడు. పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చిన జన సంధ్రాన్ని చూసి ఈసారి ఏపి ఎలక్షన్స్ లో పవన్ ఓ కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతాడని భావించారు కాని కథ అడ్డం తిరిగింది.


తన మీటింగులకు వచ్చే వాళ్లు వేసినా తన గెలుపు ఖాయం అనుకున్న పవన్ కళ్యాణ్ ను ప్రజలు మోసం చేశారు. కేవలం తన సిని గ్లామర్ వల్లే ఆ ఫాలోయింగ్ అని చివరకు గుర్తించాల్సి వచ్చింది. ఓ పక్క వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టే ఇవాళ ఆయనకే పట్టం కట్టారు ఆంధ్రా ప్రజలు.


రీల్ ఫాలోయింగ్ చూసి మురిసిపోయిన పవన్ కు దిమ్మ తిరిగి పోయేలా షాక్ ఇవ్వగా రిజల్ట్ తర్వాత పవన్ కు వచ్చింది రీల్ ఫాలోయింగ్.. జగన్ కు వచ్చింది రియల్ ఫాలోయింగ్ అని తెలుసుకున్నాడు. ఫైనల్ గా జగన్ విజయం అటు టిడిపికి, జనసేనకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. పవన్ ను గెలిపించుకోవడంలో జనసైనికులు వెనుక పడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: