వైఎస్సార్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇటీవల ఏపి ఎలక్షన్స్ ఫలితాల్లో వైసిపి అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అందుకే వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు చెబుతూ యాత్ర డైరక్టర్ మహి వి రాఘవ్ తాను చెప్పాల్సిన ఓ కథ మీరు రాశారంటూ యాత్ర 2 ఎనౌన్స్ చేశాడు.


యాత్ర సినిమాకు సీక్వల్ గా వైఎస్ జగన్ గురించి ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిందో లేదో జగన్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మహేష్ సిఎంగా భరత్ అనే నేను సినిమా చేశాడు. మళ్లీ సిఎంగా చేయడం కష్టం. ఒకవేళ మహేష్ కాకుంటే యాత్ర 2లో జగన్ గా రానా నటిస్తాడని అంటున్నారు.


అయితే రానా కూడా నటించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన చంద్రబాబుగా చేశాడు. మరి యాత్ర సీక్వల్ లో వైఎస్ జగన్ గా ఎవరు నటిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. యాత్ర టైంలో జగన్ పాత్రలో సూర్య నటిస్తాడని అన్నారు. కాని జగన్ ను చూపించకుండానే యాత్ర సినిమా ముగించారు.


మరి యాత్ర 2 కథ ఎలా ఉండబోతుంది.. సినిమాలో జగన్ గా ఎవరు నటిస్తారన్నది వైసిపి అభిమానులకు హాట్ న్యూస్ అయ్యింది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: